తెల్లరేషన్ కార్డు దారులందరికీ పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. వచ్చే ఏడాది జనవరి నుంచి రేషన్ దుకాణాల్లో సన్న బియాన్ని సరఫరా చేస్తామని తెలిపారు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెల్లరేషన్ కార్డు ఉన్న వారందరికీ సన్న బియ్యం ఇస్తామని హామీ ఇచ్చింది. అధికారంలోకి కాంగ్రెస్ వచ్చినప్పటికీ ఈ హామీ ఇంకా కార్యరూపం దాల్చలేదు. సన్నబియ్యం ఎప్పుడు ఇస్తారా..? అని వైట్ రేషన్ కార్డుదారులందరూ ఎదురుచూస్తున్నారు.
ఈ క్రమంలోనే సచివాలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ..ఎన్నికల్లో ఇచ్చిన మరో హామీని నెరవేర్చబోతున్నామని తెలిపారు. తెల్ల రేషన్ కార్డు ఉన్నవారందరికీ వచ్చే ఏడాది నుంచి సన్నబియ్యం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పీడీఎస్ బియ్యం పక్కదారి పట్టినట్లు నిర్ధారణ అయితే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.
రేషన్ దుకాణాల్లో సన్నబియ్యంతోపాటు గోధుమలను కూడా సబ్సిడీ ధరకు అందిస్తామని..సన్నబియ్యాన్ని రేషన్ డీలర్లు పక్కదోవ పట్టిస్తే ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు.