క్రికెట్ అభిమానులకు ఊహించని షాక్. భారత స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఈమేరకు సోషల్ మీడియాలో ధావన్ ఓ వీడియో పోస్ట్ చేశాడు.
ఈ వీడియోలో భావోద్వేగానికి లోనైన ధావన్.. టీమిండియా తరఫున ఆడాలనే తన కల నిజమైందని, ఈ సమయంలో తనకు అండగా నిలిచిన కుటుంబానికి, కోచ్ లకు, బీసీసీఐ, అభిమానులకు శిఖర్ ధావన్ కృతజ్ఞతలు తెలిపారు.
టీమిండియా తరుఫున అన్ని ఫార్మాట్లలో శిఖర్ ధావన్ తనదైన ముద్ర వేశాడు.రోహిత్ – ధావన్ ల ఓపెనింగ్ జోడీ టీమిండియాకు ఎన్నో విజయాలను అందించింది.
https://x.com/SDhawan25/status/1827164438673096764
తన కెరీర్ లో శిఖర్ ధావన్ 34 టెస్టులు , 167వన్డేలు , 68 టీ 20 మ్యాచులు ఆడారు. మొన్నటి ఐపీఎల్ లో పంజాబ్ కింగ్ కు సారధిగా వ్యవహరించాడు. అయితే , భుజం గాయం కారణంగా ధావన్ జట్టుకు దూరమయ్యాడు.
అయితే , శిఖర్ ధావన్ గత కొన్నాళ్ళుగా ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్నాడు. ఈ క్రమంలోనే అతను జట్టులో చోటు కోల్పోవడంతో గబ్బర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.