సినీ నటుడు నాగార్జునకు బిగ్ షాక్ తగిలింది. హైదరాబాద్ మాదాపూర్ లో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. భారీ బందోబస్తుతో శనివారం ఎన్ కన్వెన్షన్ కు చేరుకొని ఈ కూల్చివేతలు షురూ చేశారు.
నిబంధనలకు విరుద్దంగా తుమ్మిడికుంట చెరువుకు అనుకోని ఈ ఎన్ కన్వెన్షన్ నిర్మాణం చేపట్టారని ఇటీవల హైడ్రాకు ఫిర్యాదు అందింది. తుమ్మిడిచెరువులో 3 ఎకరాల 30 గుంటలను ఆక్రమించి ఈ ఎన్ కన్వెన్షన్ సెంటర్ను నిర్మించారని గుర్తించిన హైడ్రా..ఈ నిర్మాణాన్ని కూల్చివేస్తోంది.
బీఆర్ఎస్ హయాంలోనే ఎన్ కన్వెన్షన్ పై ఫిర్యాదులు అందాయి. అప్పట్లోనే కూల్చివేస్తారని ప్రచారం జరిగినా.. చివరి నిమిషంలో కూల్చివేతలకు బ్రేక్ పడింది. ఈ క్రమంలోనే హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపేందుకు రేవంత్ సర్కార్ తీసుకొచ్చిన హైడ్రాకు ఎన్ కన్వెన్షన్ పై ఫిర్యాదులు అందినా.. నాగార్జునకు చెందిన నిర్మాణం కావడంతో ఈ కూల్చివేతకు ఉపక్రమిస్తారా? అనే సందేహాలు వ్యక్తం అయ్యాయి.
అక్రమ నిర్మాణాలు చేపట్టిన ఎవరిని వదలవద్దని సర్కార్ నుంచి హైడ్రా చీఫ్ రంగనాథ్ కు ఆదేశాలు అందటంతో.. ఎన్ కన్వెన్షన్ కూల్చివేత ప్రారంభమైంది.