హైదరాబాద్లో చెరువుల్ని కాపాడేందుకు.. కబ్జాల నుంచి విముక్తి కల్పించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా సీరియస్ గా పని చేస్తోంది.ల చెరువుల్ని కబ్జా చేసిన వారిని వదిలి పెట్టడంలేదు. కూలగొట్టేస్తున్నారు. ఈ క్రమంలో చాలా మందిలో టెన్షన్ కనిపిస్తోంది. తమ ఇల్లు కూడా చెరువు శిఖం భూమిలో.. ఎఫ్టీఎల్ పరిధిలో ఉందేమో అని ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే… హైదరాబాద్లో ఏ మూలకు వెళ్లినా చెరువులు కనిపిస్తూంటాయి.
అయితే దశాబ్దాల కిందట కట్టిన వాటి గురించి భయపడాల్సిన పని లేదని.. గత పది.. పదిహేనేళ్లలో చేసిన కబ్జాలపైనే ఎక్కువగా హైడ్రా దృష్టిపెడుతోంది. ముఖ్యంగా చెరువుల ప్రవాహనికి… వర్షం వస్తే మునిగిపోయే కాలనీల సమస్యల్ని పరిష్కరించేలా.. చెరువులకు విముక్తి కల్పిస్తున్నారు. ఓ మాదిరి వర్షం పడితే.. నీళ్లు వెళ్ళడానికి దారి లేక మోకాళ్ళ లోతు నీరి చేరిపోతున్నాయి. ఇళ్లల్లోకి వచ్చేస్తున్నాయి. ఈ బాధ నుంచి నగర వాసులకు విముక్తి కల్పించాలంటే చెరువుల విముక్తే కీలకం.,
చెరువు భూములు, ఎఫ్ టీఎల్ భూముల్లో నిర్మాణాలకు అనుమతి రాదు. కానీ అధికారుల అక్రమాల వల్ల చాలా మంది అమాయకులు మోసపోయారు. ఇప్పుడు హైడ్రా దూకుడు కారణంగా తమ స్థలాలు, ఇళ్లు చెరువు పరిధిలో ఏమైనా ఉన్నాయా అని ఆందోళన చెందుతున్నారు. ఈ విషయాన్ని ఆన్ లైన్ లో చెక్ చేసుకునే వెసులుబాటు ఉంది. Lakes.hmda.Gov.in వెబ్ సైట్ లోకి వెళ్లి మీ ఇళ్లు ఏ చెరువు సమీపంలో ఉందో.. ఆ చెరువు ఫుల్ ట్యాంక్ లెవల్ పరిధిలో ఉన్నాయా లేదా అన్నది చెక్ చేసుకోవచ్చు.
కొత్త ఇళ్లు, స్థలాలు కొనాలనుకునేవారు కూడా ఈ వెబ్ సైట్ ద్వారా తాము కొనాలనుకుంటున్నది చెరువు స్థలం కాదని తెలుసుకోవచ్చు. ఎవరైనా కొత్తగా ఒప్పందాలు చేసుకున్న వారు కూడా ఈ వెబ్ సైట్ పరిశీలించి… ఒప్పందంపై ముందుకెళ్లేలా వద్దా అన్నది నిర్ణయించుకోవచ్చు. తక్కువకు వస్తుంది కదా అని చెరువు ఎఫ్ టీఎల్ ల్యాండ్ కొంటే ఎప్పటికైనా పెద్ద సమస్యే.