బీజేపీని హర్యానా అసెంబ్లీ ఎన్నికలు బయపెడుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో తగిలిన ఎదురుదెబ్బతో అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితం ఎలా ఉటుందా అని కంగారు పడుతున్నారు. జమ్మూకశ్మీర్ తో పాటు హర్యానా అసెంబ్లీ ఎన్నికలకూ ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. హర్యానాలో 90 స్థానాలకు అక్టోబర్ 1న ఒకే దశలో ఎన్నికలు జరుగుతాయి. ఫలితాలు అక్టోబర్ 4న వెలువడనున్నాయి. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు విడివిడిగా పోటీ చేయనున్నాయి. హర్యానాలో 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయిన కాంగ్రెస్.. 2024 లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం 5 స్థానాలను గెలుచుని పుంజుకుంది. కాంగ్రెస్ ఓట్ల శాతం 28 నుంచి 43 శాతానికి పెరిగింది. అంటే తిరుగులేని పొజిషన్‌కు చేరుకున్నట్లే.
హర్యానాలో రైతులదే గెలుపోటముల్లో కీలక పాత్ర. బీజేపీపై రైతుల్లో ఉన్న అసంతృప్తి పార్లమెంట్ ఎన్నికల్లో బయటపడింది. అలాగే అక్కడి యువత ఎక్కువగా సైన్యంలోకి వెళ్తూంటారు. అగ్నివీర్ పథకంపై యువతలో వ్యతిరేకత వస్తోంది. ఎప్పుడు ఎన్నికలు జరిగినా హర్యానాలో రైతు సమస్యలే హైలెట్ అవుతాయి. పరిస్థితి బాగోలేదని సీఎంగా ఉన్న మనోహర్ లాల్ ఖట్టర్‌ను తొలగించి, నాయబ్ సింగ్ సైనీకి పీఠం అప్పగించారు. అయినా పరిస్థితిలో పెద్దగా మారపు రాలేదు.
సామాజిక సమీకరణాలను అనుకూలంగా మల్చుకునేందుకు బీేజపీ గట్టి ప్రయత్నాలు ేస్తోంది. జాట్ ఓటును చీల్చేందుకు, హర్యానా మాజీ సిఎం బన్సీలాల్ కోడలు కిరణ్ చౌదరిని పార్టీలో చేర్చుకున్నారు. హర్యానాలో కాంగ్రెస్ జాట్, దళిత ఓటు బ్యాంక్ పై ఆశలు పెట్టకుంది. మిగతా ఓటర్లు తమకు మద్దతిస్తారని బీజేపీ నమ్మకంతో ఉంది. జాతీయ పార్టీలతో పాటు INLD, JJP కూడా కీలకమే. గత లో JJP కింగ్ మేకర్ అయింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలవకపోతే అది కేంద్రంలోని ప్రభుత్వంపై ప్రభావం చూపిస్తుంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలని వ్యూహాలు పన్నుతున్నారు.