‘చిలసౌ’తో గుర్తింపు తెచ్చుకొంది రుహానీ శర్మ. చూడ్డానికి చాలా డీసెంట్ గా కనిపిస్తుంది. పద్ధతిగా ఉంటుంది. తనకూ అలాంటి పాత్రలే దక్కాయి. కానీ ఇప్పుడు సడన్‌గా రూటు మార్చింది. ఒక్కసారిగా బోల్డ్ సీన్స్‌లో కనిపించేస్తోంది. ‘ఆగ్రా’ అనే సినిమాలో రుహానీ కొన్ని బోల్డ్ సీన్స్ చేసింది. అవన్నీ చూసి ‘ఇది మన రుహానీనా’ అంటూ అంతా ముక్కున వేలేసుకొంటున్నారు. ‘ఆగ్రా’ ఇంకా విడుదల కాలేదు. కాకపోతే.. ఈ సినిమా ముందే లీకైపోయింది. దాంతో రుహానీ ఆవేదన వ్యక్తం చేసింది. ఇన్నేళ్లు పడిన కష్టమంతా బుగ్గిపాలు అయిపోయిందంటూ బాధ పడుతోంది. అయితే రుహానీ చేసిన బోల్డ్ సీన్స్ గురించి అంతటా చర్చ నడుస్తోంది. ఈ విషయంలో తనని తాను సమర్థించుకొంది. చాలా ఇష్టపడి, కష్టపడి ఆ పాత్ర చేశానని, ఈ సినిమాలో ఇలాంటి సన్నివేశాలల్లో నటించడం పట్ల తానేం బాధ పడడం లేదని స్పష్టం చేసింది. సోషల్ మీడియా అంతా ఇప్పుడు రుహానీ బోల్డ్ సీన్లే చక్కర్లు కొడుతున్నాయి.
ఇది వరకు రాధికా ఆప్టే ‘పర్చేడ్’ అనే ఓ సినిమాలో నటించింది. అందులో రాధిక కనీ వినీ ఎరుగని విధంగా కొన్ని బోల్డ్ సీన్స్ చేసింది. అయితే అవన్నీ ‘పర్చేడ్’ విడుదలకు ముందే లీకయ్యాయి. ‘ది వెడ్డింగ్ గెస్ట్’ అనే సినిమాలోనూ రాధిక బోల్డ్‌గా నటించింది. ఈ సినిమాలోని సదరు బోల్డ్ సీన్లు కూడా ముందే బయటకు వచ్చేశాయి. ఆ తరవాత సినిమాలు విడుదల అయ్యాయి. రాధిక బోల్డ్ సీన్లు లీకవ్వడం వల్ల సదరు చిత్రాలకు కావల్సినంత ఫ్రీ పబ్లిసిటీ దొరికింది. ఆ తరవాత సినిమాల్లో విషయం లేకపోవడం వల్ల అవి తేలిపోయాయనుకోండి. అది వేరే విషయం. ఇప్పుడు రుహానీ కూడా అదే చేస్తోందా అనే అనుమానం వ్యక్తం అవుతోంది. ‘ఆగ్రా’ సినిమా గురించి ఎవ్వరికీ తెలీదు. అందులోని సీన్లు లీక్ అవ్వడం వల్ల పబ్లిసిటీ వచ్చింది. పైగా రుహానీ చేసిన బోల్డ్ సీన్లు చాలా ఘోరంగా ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు జనం మాట్లాడుకొంటున్నారు. దాంతో.. వద్దన్నా ‘ఆగ్రా’ సినిమాపై ఫోకస్ పడుతుంది. అది ఆ సినిమా పబ్లిసిటీకి కావల్సినంత బూస్టప్ ఇస్తుంది. ఒకవేళ రుహానీ మైండ్ లో.. ఇదంతా లేకపోయినా, దర్శక నిర్మాతలు ఈ ట్రిక్ ప్లే చేసి ఉండొచ్చు. వీటివల్ల జనంలో చర్చ అయితే జరుగుతుంది. కానీ కాసులు రాలతాయా? అనేదే పెద్ద ప్రశ్న.