అమెరికాలో ప్రవాస భారతీయుల్లో ప్రముఖ వైద్యుడిగా గుర్తింపు పొందిన పెరంశెట్టి రమేష్ బాబు అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. అత్యంత విజయవంతమైన వైద్యునిగా గుర్తింపు పొందిన ఆయన క్రిమ్సన్ కేర్ పేరుతో హాస్పిటల్స్ గ్రూప్ ను నిర్వహిస్తున్నారు. ఆయన కుమారుడు ఇటీవల క్రిమ్సన్ కేర్ ఆస్పత్రుల గ్రూపులో కీలక బాధ్యతలు తీసుకున్నారు.
తిరుపతికి చెందిన ఆయన మెడిసిన్ ఇక్కడే పూర్తి చేశారు. వెస్టిండీస్ లో పీజీ పూర్తి చేసి అమెరికాలో ప్రాక్టీస్ ప్రారంభించారు. అక్కడే ఆయన ప్రముఖ వైద్యునిగా ఎదిగారు. అలబామా రాష్ట్రంలోని టస్కలోనా సిటీలో నివాసం ఉంటుంది. కరోనా సమయంలో ఆయన చేసిన సేవలు అమెరికా ప్రజల దృష్టిని ఆకర్షించాయి. ఆయనకు ఎన్నో అవార్డులు లభించాయి.
వివాద రహితంగా ఉండే ఆయన… అక్కడి ప్రజలకు ఎంతో ఇష్టుడయ్యారు. టస్కలోనాలో ఓ రోడ్డుకు పెరంశెట్టి పేరు పెట్టారు కూడా. ఆయన చనిపోయాడనే వార్త అలబామా మీడియాలో సంచలనంగా మారింది. డాక్టర్ పెరంశెట్టి రమేష్ మృతి విషయంలో ఆయన కుటుంబీకులు తమ ప్రైవసీని గౌరవించాలని మీడియాను కోరారు.