బీజేపీలో చేరక ముందే రైతు ఉద్యమంపై దారుణ వ్యాఖ్యలు చేసి తీవ్ర విమర్శలు చేసిన హీరోయిన్ కంగనా రనౌత్ ఇప్పుడు మరోసారి రైతుల్ని టార్గెట్ చేశారు. మోదీ ప్రభుత్వం గట్టిగా ఉండకపోతే.. .రైతులు ఉద్యమంపేరుతో ఇప్పుడున్న బంగ్లాదేశ్ పరిస్థితిని ఇండియాలో ఎప్పుడో సృష్టించేవారని చెప్పుకొచ్చారు. అంటే తిరుగుబాటు చేసి.. ప్రభుత్వాన్ని .. ప్రభుత్వ పెద్దల్ని తరిమేసేవారని కంగనా అభిప్రాయం. ఆమె ఉద్దేశంలో ఆందోళనకారులు ..ఆతంకవాదులు. వారి హక్కుల కోసం పోరాడేవారంతా.. అాలంటి వాళ్లేనని అర్థం చేసుకోవచ్చు.
సిమ్లాకు చెందిన కంగనా రనౌత్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటి సారి కాదు. పలుమార్లు రైతులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రైతు ఉద్యమం చేసిన వారిలో అత్యధికులు పంజాబ్, హర్యనా, యూపీలకు చెందినవారు. ఆమె వ్యాఖ్యలపై ఆగ్రహం చెందిన ఓ రైతు బిడ్డ.. సీఆర్పీఎఫ్ జవాన్ గా ఎయిర్ పోర్టులో విధులు నిర్వహిస్తున్న సమయంలో కంగనా చెంప చెళ్లుమనిపించారు. ఈ ఘటన ఎంపీగా గెలిచి ఢిల్లీకి వచ్చిన సందర్భంలో జరిగింది.
అయినా కంగనా రనౌత్ మాత్తరం తన మాట తీరు మార్చుకోలేదు. ప్రతీ దానికి.. రైతుల్ని ముడిపెట్టి నిందించడం మానుకోలేదు. నిజంగా బంగ్లాదేశ్ తరహాలో దేశంలో తిరుగుబాటు వస్తే.. అది తప్పే కాదు. ఎందుకంటే ప్రభుత్వాలపై కోపం వస్తే..తిరుగుబాటు చేసే హక్కు ప్రజలకు ఉంది. దాన్ని ఎంత అణిచి వేయడానికి ప్రయత్నిస్తే ఎంతగా ఎగసి పడుతుంది. కంగనాకు అది ఇంకా అర్థం కాలేదన్న సెటైర్లు వినిపిస్తున్నాయి.
అయితే కంగనా వ్యాఖ్యలపై బీజేపీ అప్రమత్తమయింది. బీజీపే పాలసీలపై మాట్లాడే హక్కు కంగనాకు లేదని.. అవి ఆమె వ్యక్తిగత అభిప్రాయాలేనని స్పష్టం చేసింది.