వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఓ మహిళతో వీడియో చాటింగ్ లో తొందరపడ్డారో… ఆమె .. ఆమె సంబంధీకులు ఎలా బ్లాక్ మెయిల్ చేశారో అన్నీ ఆయనే బయట పెట్టుకుంటున్నారు.. ఈ వీడియో చూపించి తన దగ్గర రూ. పదమూడు లక్షల ముఫ్పై వేలు వసూలు చేశారని బ్యాంక్ డిపాజిట్ స్లిప్పులతో సహా అనంతబాబు అడ్డతీగల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో ఆ వీడియో నిజమేనని.. దాన్ని బయట పెట్టకుండా ఉండటానికే డబ్బులిచ్చానని పరోక్షంగా అంగీకరించినట్లయింది.
విషయమేమింటే ఆయన ఓ మహిళతో వీడియో చాటింగ్ చేశారో ఆ మహిళ పేరు కూడా పోలీసులకు చెప్పారు. ఇప్పుడు ఆ వీడియో నిజమో కాదో నిగ్గు తేల్చిన తర్వాత పోలీసులు మిగతా విషయాల మీద దృష్టి పెడతారు. అది నిజమేనని పోలీసులు తేల్చి.. అనంతబాబును బ్లాక్ మెయిల్ చేసిన వాళ్లపై కేసులు పెడతారు. వారు తమను లైంగికంగా వేధించారని ఎదురు ఫిర్యాదు చేస్తే అనంతబాబు మళ్లీ జైలుకు వెళ్లాల్సి ఉంటుంది.
ఎలా చూసినా అనంతబాబు ఇప్పుడు అటు డబ్బులు.. ఇటు పరువు పోగొట్టుకున్నట్లయింది. ఆయను సంబంధించిన వ్యవహారాలపై మన్యం మొత్తం చిత్రవిచిత్రంగా చెప్పుకుంటున్నారు. గతంలో అనంతబాబును చూస్తే భయపడే మన్యం జనాలు ఇప్పుడు మొహం మీదనే నవ్వుతున్నారు. ఆయన పరిస్థితి చూసి.. ఇతర నేతలు కూడా జూలి చూపిస్తున్నారు.