‘కుమారి 21 ఎఫ్’తో ఆకట్టుకొన్నాడు సూర్య ప్రతాప్. సుకుమార్ ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, సంభాషణలు అందించారు. ఆ తరవాత ’18 పేజీస్’ కూడా డీసెంట్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు సూర్య ప్రతాప్ అమేజాన్ కోసం ఓ వెబ్ సిరీస్ రూపొందిస్తున్నాడు. ఆ తరవాత నందమూరి హీరో కల్యాణ్ రామ్ తో ఓ సినిమా చేయబోతున్నాడని టాక్. ఇటీవల కల్యాణ్ రామ్ కు ఓ కథ వినిపించాడట సూర్య ప్రతాప్. ఇది ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లోనే రూపొందించే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమా కథలో సుకుమార్ ప్రమేయం ఉందో, లేదో తెలియాల్సివుంది.
కల్యాణ్ రామ్ ప్రస్తుతం ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇందులో విజయశాంతి కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ‘మెరుపు’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఇది వరకు రామ్ చరణ్ ‘మెరుపు’ అనే పేరుతో ఓ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. కానీ ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయిది. అప్పటి నుంచి ఆ టైటిల్ అలా పెండింగ్ లోనే ఉంది. ఇప్పుడు కల్యాణ్ రామ్ సినిమా కోసం ఈ టైటిల్ అనుకొంటున్నారు. త్వరలోనే టైటిల్ అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ప్రదీప్ సినిమా పూర్తయ్యాక… సూర్య ప్రతాప్ ప్రాజెక్ట్ పట్టాలెక్కే ఛాన్సుంది.