ఈమధ్య ప్రీమియర్ షోల హవా బాగా పెరిగిపోయింది. చిన్న సినిమాలకు సైతం పెయిడ్ ప్రీమియర్లు వేస్తున్నారు. టాక్ బాగుంటే రిలీజ్ డే నాటికి ఓపెనింగ్స్ అదిరిపోతున్నాయి. కాస్త అటూ ఇటుగా ఉంటే మొదటికే మోసం వస్తోంది. ఈ విషయం చాలా సందర్భాల్లో రుజువు అయ్యింది కూడా. ఈ గురువారం ‘సరిపోదా శనివారం’ విడుదల కానుంది. గత నాలుగైదు సినిమాలకు విడుదలకు ముందు రోజు ప్రీమియర్ వేయడం నానికి అలవాటుగా మారింది. అయితే ‘సరిపోదా శనివారం’ మాత్రం ఇందుకు మినహాయింపు. ఈ చిత్రానికి ప్రీమియర్లు లేవు. కాకపోతే… హైదరాబాద్ లాంటి మహా నగరాల్లో ఉదయం 7 గంటలకే తొలి షో పడిపోతుంది.
అడ్వాన్స్ బుకింగుల్లో ‘సరిపోదా..’ మంచి నెంబర్లే సంపాదిస్తోంది. తొలి రోజు దాదాపుగా అన్ని షోలూ హౌస్ ఫుల్స్ అయిపోయాయి. టాక్ బాగుంటే లాంగ్ వీకెండ్ ఈ సినిమాకు హెల్ప్ అవుతుంది. ఈమధ్య కాలంలో అడ్వాన్సు బుకింగులు ఇంత స్పీడుగా ఉన్న సినిమా మరోటి లేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. రన్ టైమ్ విషయంలోనూ చిత్రబృందం కాస్త కేర్ తీసుకొన్నట్టు అర్థమవుతోంది. టైటిల్ కార్డుతో సహా 2 గంటల 50 నిమిషాల నిడివి తేలింది. సెన్సార్ తరవాత మరో 5 నిమిషాలు ట్రిమ్ చేసినట్టు తెలుస్తోంది. అంటే ఈ సినిమా రన్ టైమ్ 2 గంటల 45 నిమిషాలకు ఫిక్సయ్యిందన్నమాట.