కవితకు బెయిల్ వచ్చింది. కానీ ఆ బెయిల్ రావడానికి తెర వెనుక ఏదో జరిగిందన్న అభిప్రాయం ఏర్పడటానికి కేటీఆర్ ఓవరాక్షనే కారణమన్న అభిప్రాయం గట్టిగా బలపడుతోంది. వచ్చే వారంలో బెయిల్ వస్తుందని..గతంలో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ చెప్పేశారు. ఏదో డీల్ చేసుకున్నట్లుగా కాన్ఫిడెంట్ గా ఆయన చెప్పడం వివాదాస్పదమయింది. తాజాగా మంగళవారం ఖచ్చితంగా బెయిల్ వచ్చేస్తుందని పార్టీ బలగాన్ని తీసేసుకుని సోమవారమే ఆయన ఢిల్లీకి వెళ్లారు. దీంతో కవితకు బెయిల్ ఖాయమని..దానికి తెర వెనుక జరిగినే డీల్సే కారణమని ఎక్కువ మంది నమ్మడం ప్రారంభించారు.
కవితకు బెయిల్ వచ్చిన తర్వాత ఎవరూ అలాంటి కామెంట్స్ చేయలేదు. ఎందుకంటే సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది కాబట్టి అందరూ మనసులో అనుకన్నారు కానీ బయట పెట్టుకోలేదు..కానీ బండి సంజయ్ మాత్రం.. ఎక్కడ బీజేపీ బెయిలిప్పించిందని అనుకుంటారోనని.. హడావుడిగా.. కాంగ్రెస్ నే బెయిలిప్పించిందని ట్వీట్ చేశారు. ఆ పార్టీ నేత అభిషేక్ సింఘ్వి కవిత కోసం వాదించారన్నారు. ఈ ట్వీట్ పైనా కేటీఆర్ స్పందించారు. సుప్రీంకోర్టు తీర్పును వక్రీకరిస్తున్నారని.. బండి సంజయ్ పై చర్యలు తీసుకోవాలని ాయన ట్వీట్ చేశారు. దీంతో మరింతగా ఈ అంశంపై చర్చ జరుగుతోంది.
కవితను ఇప్పటికే జైల్లో పెట్టి ఐదు నెలలు దాటిపోయింది. మెరిట్ ప్రకారం అయినా కవితకు బెయిల్ వస్తుందన్న అభిప్రాయం ఉంది. అయితే కేటీఆర్ మాత్రం.. ఎందుకో హడావుడి చేశారు కానీ.. అది రాంగ్ సిగ్నల్స్ పంపింది. లేనిపోని రాజకీయానికి కారణం అయింది. చివరికి ఈ అంశంలో కోర్టు ప్రస్తావన రావడం కూడా కేటీఆర్ చేసిన హడావుడి ఫలితమే అనుకోవచ్చని చెబుతున్నారు.