అజేయకల్లాం అలియాస్ కల్లం అజేయరెడ్డి జగన్ రెడ్డి సర్కారులో ప్రధాన సలహాదారు. ఆయనకు జగన్ ఓ బహుమతి ఇచ్చారు. అదేమిటంటే.. శ్రీశైలం టెంపుల్కు పోటీగా సొంతంగా గుడి కట్టుకోమని ఆఫర్ ఇచ్చేశారు అందు కోసం శ్రీశైలం ఆలయానికి సమీపంలో ఉన్న చెరువునే రాసిచ్చేశారు. ఇప్పుడీ వ్యవహారం హైకోర్టుకు చేరడంతో అసలు విషయం వెలుగు చూసింది.
మాజీ సీఎస్ , జగన్ ప్రధాన సలహాదారు అజేయకల్లం ఫౌండర్ ట్రస్టీగా సేనాని సుబ్రహ్మణ్యస్వామి అనే ట్రస్టును ఏర్పాటు చేశారు. ఈ ట్రస్టు తరపున ఓ ఆలయాన్ని శ్రీశైలంలో నిర్మించాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా శ్రీశైలం ఆలయానికి సమీపంలో ఉండే తొమ్మిది ఎకరాల ఏనుగుల చెరువును రాసిచ్చేశారు. అది కూడా ట్రస్టుకు కాదు.. వీబీ టెక్నోక్రాఫ్ట్స్ ప్రైవేటు లిమిటెడ కంపెనీకి కేటాయించారు. ఎందుకంటే ఆలయ నిర్మాణానికి ట్రస్టు… ఈ సంస్థతోనే ఒప్పంం చేసుకుంది.
ఆలయానికి చెరువును ఇచ్చినా మరో ఇరవై ఎకరాలు వినియోగించుకుంటారు. ఈ ఆలయానికి శ్రీశైలం ఆలయానికి సంబంధం లేదు. ప్రైవేటుగా నిర్వహిస్తారు. ఈ అరాచకం ఏమిటని కొంత మంది హైకోర్టులో పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్లపై విచారణలో హైకోర్టు ఇదేం తీరని ఆశ్చర్యపోయింది. శ్రీశైలం ఆలయానికిపోటీగా ప్రైవేటు ఆలయాన్ని ప్రోత్సహిస్తున్నట్లుగా ఉందని ఇదేం పద్దతని ప్రశ్నించింది. ఇప్పుడు అజేయకల్లాం నిర్వాకం హైలెట్ అవుతోంది. దోచుకున్న వాడికి దోచుకున్నంత అన్నట్లుగా సాగిన పాలనలో… అజేయకల్లం తన వాటా తాను ఇలా గుడి రూపంలో పొందే ప్రయత్నం చేశారు. ఇటీవల గడ్డం పెంచుకుని తిరుగుతున్న ఆయన తీరుకు కారణం ఇప్పుడు బయటకు వచ్చింది.