ఏపీ రాజధాని అమరావతిని వరల్డ్ సిటీగా మార్చుతామన్న సీఎం చంద్రబాబాబు అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. అమరావతి ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ)సిటీగా ఉండాలని, ఆ దిశగా ప్రణాళికలు సిద్దం చేయాలని ఆదేశించారు. గురువారం సచివాలయంలో పురపాలక శాఖ మంత్రి నారాయణ, సీఆర్డీయే అధికారులతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.
ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ అర్థం వచ్చేలా అమరావతి లోగోను అమరావతి పేరులోని మొదటి అక్షరం A, చివరి అక్షరం I కలిసి వచ్చేలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ లోగో రెడీ చేయాలన్నారు. రాజధానిలో ఎటుచూసినా సాంకేతిక ఉట్టిపడేలా రాజధాని నిర్మాణం చేపట్టాలన్నారు.
గత ప్రభుత్వం అమరావతిపై కక్ష సాధించిందని, ఉద్దేశపూర్వకంగా రాజధానిగా అమరావతిని పక్కన పెట్టిందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలు గర్వంతో చెప్పుకునేలా రాజధాని నిర్మాణం ఉండాలని వివరించారు. రాజధానిలో ప్రభుత్వ భవనాల నిర్మాణం, అందుకు అయ్యే సమయం.. టెండర్లు పిలవడం తదితర అంశాలపై ఈ సమావేశంలో చంద్రబాబు సమీక్షించారు.
టీడీపీ హయాంలో సీఆర్డీయే కార్యాలయంను ఎంతమేరకు చేపట్టామో..ఇప్పుడు అలాగే ఉండిపోయిందని, వైసీపీ ఈ నిర్మాణాలను పక్కన పెట్టిందని అధికారులు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లగా..ఈ భవన నిర్మాణం మూడు నెలల్లో చేపట్టి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. అత్యాధునిక టెక్నాలతో , అన్ని సౌకర్యాలతో నిర్మాణాలు చేపట్టాలని ఆదేశించారు.