హైడ్రా విషయంలో వెనక్కి తగ్గబోం.. తన, మన అనే బేధం లేకుండా కూల్చివేతలు ఉంటాయి..ఎఫ్ టీఎల్ , బఫర్ జోన్ లో అక్రమ నిర్మాణాలు ఉంటే కూల్చివేతలకు మానసికంగా ప్రిపేర్ అవ్వండి అని ఇటీవలే కాంగ్రెస్ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
హిమాయత్ సాగర్ వైపు కాంగ్రెస్ నేతలకు చెందిన భవనాలు ఎఫ్ టీ ఎల్ పరిధిలో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. వీటిపై ఫోకస్ పెట్టిన హైడ్రా..ఆయా నిర్మాణాలు ఎఫ్ టీ ఎల్ హద్దు లోపల ఎంత వరకు ఉన్నాయి..? బఫర్ జోన్ లోపల, వెలుపల ఎంతమేరకు ఉన్నాయి..? అనే వివరాలతో నివేదిక ఇవ్వాలని జలమండలి, రెవెన్యూ అధికారులను ఆదేశించినట్లుగా సమాచారం.
అన్ని వివరాలతో వచ్చే సోమవారానికి పూర్తి స్థాయి నివేదికను అందజేస్తామని అధికారులు హైడ్రాకు సమాచారం అందించారు. అయితే, అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే వ్యవసాయ క్షేత్రంతోపాటు ఫామ్ హౌజ్ కూడా నిబంధనలకు విరుద్దంగా ఉందని ఆరోపణలు వస్తున్నాయి. దీంతో వచ్చే వారం హైడ్రా బుల్డోజర్లు..కాంగ్రెస్ నేతల కట్టడాలపై దూసుకువెళ్లనున్నాయని తెలుస్తోంది. ఇదే జరిగితే హైడ్రా మరో సంచలనం సృష్టించినట్లే.