హైదరాబాద్‌లో సొంత ఇల్లు అనేది లక్షల మంది కల. అపార్టుమెంట్లలో ఉండటం కన్నా.. ఓ చిన్న స్థలంలో అయినా ఇండిపెండెంట్ ఇంట్లో ఉండాలనుకునేవారు తక్కువే ఉండరు. అలాంటి వారికి శివారు ప్రాంతాలు గొప్పవరం. పదేళ్ల తర్వతా అవి సిటీలో కలిసిపోతాయి. ఇప్పుడు సిటీలో అపార్టుమెంట్లే కొనలేరు.. ఇక ఇండిపెండెంట్ హౌసుల్ని కొనడం సాధ్యం కాదు. అయితే ఓ పావుగంట జర్నీ టైం పెంచుకోగలిగితే మాత్రం చాలా సొంత ఇంటి అవకాశాలు ఉన్నాయి. అలాంటి వాటిలో ఒకటి ఇస్నాపూర్.
ఐటీ కారిడార్‌కు దగ్గరలో ముుంబై హైవేైపై ఉంటుంది ఇస్నాపూర్. పటాన్ చెరు ఔటర్ రింగ్ రోడ్ జంక్షన్ దాటిన వెంటనే వస్తుంది. ఈ ప్రాంతంలో ఇప్పుడు జోరుగా నిర్మాణాలు జరుగుతున్నాయి. స్థానిక మేస్త్రీలు జోరుగా ఇళ్లు కట్టి అమ్ముతున్నారు. రెండు వందల గజాల స్థలంలో మంచి ఇల్లు కట్టి .. రూ. కోటి లోపునకే అమ్ముతున్నారు. ఇస్నాపూర్ పేరుకే విలేజీ కానీ.. అన్ని రకాల విద్య, వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. దగ్గరలోనే ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉంటాయి.
ఐటీ కారిడార్ కు .. ఔటర్ రింగ్ రోడ్ ఎక్కితే పావుగంటలో గచ్చిబౌలికి వెళ్లిపోవచ్చు. ఇప్పుడిప్పుడే ఇస్నాపూర్ ప్లస్ పాయింట్లను బడా నిర్మాణ సంస్థలు చూస్తున్నాయి. సమీపంలోనే రాంకీ హైరైజ్ అపార్టుమెంట్లు నిర్మిస్తుంది. జన ప్రియ అందుబాటు ధరల్లో అపార్టుమెంట్లు కట్టేసి అమ్మేస్తోంది కూడా. కాస్త దూరం వెళ్లినా… తక్కువకు.. ఇంటి సౌకర్యం పొందాలనుకుంటే.. ఇస్నాపూర్ మంచి అవకాశం అనుకోవచ్చు.