పవన్ కల్యాణ్ ఇప్పుడు రాజకీయాలతో బిజీగా ఉన్నారు. ఆయన కాస్త బ్రేక్ ఇచ్చి సినిమాల పని పట్టాలని డిసైడ్ అయ్యారు. అయితే చేతిలో ఉన్న సినిమాలన్నీ పూర్తి చేస్తారా? లేదా? అనే అనుమానాలు అభిమానులకు ఉన్నాయి. ‘హరి హర వీరమల్లు’, ‘ఓజీ’ సినిమాల్ని పవన్ పూర్తి చేస్తారని, ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ని పూర్తిగా పక్కన పెట్టేస్తారని గుసగుసలు వినిపించాయి. దానికీ కారణాలు లేకపోలేదు. `ఉస్తాద్` 20 శాతం మించి షూటింగ్ జరగలేదు. మిగిలినవి అలా కాదు. పవన్ గట్టిగా చెరో నెల రోజులు సమయం కేటాయిస్తే సరిపోతుంది. మరోవైపు ‘మిస్టర్ బచ్చన్’తో హరీష్ శంకర్‌కు గట్టి ఫ్లాప్ తగిలింది. అందుకే `ఉస్తాద్`ని పవన్ పూర్తిగా వదిలేసే అవకాశాలు లేకపోలేదనుకొన్నారంతా.
అయితే ఇప్పుడు మైత్రీ మూవీస్ ఈ ఇష్యూపై క్లారిటీ ఇచ్చింది. డిసెంబరు, జనవరి నాటికి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా పూర్తి చేస్తామని, పవన్ డేట్లు ఇచ్చారని, కొద్ది వారాల్లో షూటింగ్ కూడా మొదలు కానుందని తెలిపింది. అంతే కాదు.. సెప్టెంబరు 2 పవన్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఓ అప్ డేట్ ఇవ్వడానికి కూడా రెడీ అవుతోంది. అంటే పవన్ మూడు సినిమాల్నీ పూర్తి చేయాలని డిసైడ్ అయ్యారన్నమాట. ఇది పవన్ ఫ్యాన్స్‌ని ఖుషీ చేసే వార్తే. అన్నిటికంటే ముఖ్యంగా దర్శకుడు హరీష్ శంకర్‌కు బూస్టప్ ఇచ్చే విషయం ఇది. ‘బచ్చన్’తో పోయిన పరువుని ఈ సినిమాతో వడ్డీతో సహా తిరిగి రాబట్టుకొనే ఛాన్స్వుంది.