కొత్తగా ఇల్లు కొనాలనుకునేవారి మొదటి ప్రయారిటీ గేటెడ్ కమ్యూనిటీలు. చుట్టూ గోడ కట్టుకుని అందులో ప్రత్యేకమైన కాలనీగా ఏర్పాటు చేసుకుని ప్రత్యేక సౌకర్యాలను భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడమే గేటెడ్ కమ్యూనిటీ. ఈ కమ్యూనిటీలో పబ్లిక్ రోడ్లు ఉండవు. ఆ కాలనీ బిల్డర్ లేదా.. అందరూ కలిసి నిర్మించుకున్న రోడ్లు ఉంటాయి. డ్రైనేజీలు కూడా వాళ్లు నిర్మించుకోవాల్సిందే. నిర్వహణ విషయంలో స్థానిక సంస్థలకు బాధ్యత ఉంటుంది. అంటే… తమ సౌకర్యాలను తామే ఏర్పాటు చేసుకుని ప్రశాంత జీవనం సాగించడానికి గేటెడ్ కమ్యూనిటీలు బాగుంటాయి.
అందుకే ఇలాంటి కమ్యూనిటీల్లో జీవించడానికి ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. ఫలితంగా బిల్డర్లు గేటెడ్ కమ్యూనిటీ పేరుతో తమ వెంచర్లకు మార్కెటింగ్ చేసుకుంటున్నారు. గతంలో హైదరాబాద్ వంటి నగరాలకే ఇవి పరిమితమయ్యాయి.కానీ ఇప్పుడు ద్వితీయ శ్రేణి నగరాలకూ విస్తరిస్తున్నాయి. ఇప్పుడు అపార్టుమెంట్లకు కూడా గేటెడ్ కమ్యూనిటీ అని పేరు పెడుతున్నారు. నాలుగుదై అపార్టుమెంట్ల కాంప్లెక్స్ లాగా నిర్మాణం చేసి లోపల అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తే గేటెడ్ కమ్యూనిటీ అవుతుంది.
గేటెడ్ కమ్యూనిటీలో ఫంక్షన్లు చేసుకోవడానికి… క్లబ్ హౌస్., స్విమ్మింగ్ ఫూల్, కిడ్స్ ప్లే ఏరియా, వాకింగ్ ట్రాక్ ఇలా చాలా సౌకర్యాలను కల్పించాల్సి ఉంటుంది. వాటన్నింటికీ అందరూ సమానంగా డబ్బులు చెల్లించాలి. కాస్త ఖరీదు అయినా ఇలాంటి కాలన్నీల్లో ఉండేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే గేటెడ కమ్యూనిటీలు హాట్ ఫేవరేట్ గా మారుతున్నాయి.