ఏపీ నామినేటెడ్ పోస్టుల్లో బీజేపీకి ఇచ్చే వాటాకు తగ్గట్లుగా కేంద్ర నామినేటెడ్ పోస్టుల్లో టీడీపీ , జనసేన నేతలకు కూడా చాన్సివ్వాలని చంద్రబాబు పట్టుబడుతున్నట్లుగా తెలుస్తోంది. నామినేటెడ్ పదవుల భర్తీ కి జాబితాను చంద్రబాబు సిద్దం చేశారు. అయితే బీజేపీ మాత్రం..తమకు ఎక్కువ కావాలని పట్టుబడుతున్నట్లుగా తెలుస్తోంది. ఎన్నికల్లో పోటీ చేస్తే కనీసం పది ఓట్లు తెచ్చుకోలేని బీజేపీ నేతలంతా లాబీయింగ్ లో సిద్దహస్తులు. వారంతా హైకమాండ్ పై గట్టిగా ఒత్తిడి తెస్తున్నారు. తమ కోసం ఓ మాట చెప్పాలంటున్నారు.
వారు ఆ మాటల్ని టీడీపీ అధినేతకు చేరవేస్తున్నారు. అయితే చంద్రబాబు… కేంద్రంలో తమకు ఏ నామినేటెడ్ పోస్టులు ఇస్తారో చెప్పాలన్నట్లుగా మాట్లాడుతున్నారని అంటున్నారు. వైసీపీకి చెందిన కొంత మంది రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు రాజీనామాలు చేయబోతున్నారు. ఆ పదవుల్లోనూ బీజేపీకి వాటా ఇవ్వక తప్పదు. అందుకే కాస్త ఆగి మొత్తం సెటిల్ చేద్దామనుకుంటున్నారు.
టీడీపీకి చెందిన కొంత మంది సీనియర్లకు కేంద్ర నామినెటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యం లభించే అవకాశాలు ఉన్నాయి. అక్కడా ఇక్కడా లెక్క తేలిన తర్వాతనే పదవుల పంపకంపై ఓక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దీని కోసం… ఓ నెల రోజుల సమయం పడుతుదంని చంద్రబాబు చెబుతున్నారు.