ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణకు కూడా ఏపీ రాజకీయాల విషయంలో చాలా కన్ప్యూజన్ గా ఉంది. వారం వారం ఆయన అభిప్రాయాలు మార్చేసుకుంటున్నారు. ఓ సారి వైసీపీ నేతల్లా విచ్చలవిడిగా ప్రవర్తిస్తే .. వాళ్లకి , వీళ్లకి తేడా ఏముంటుందని అంటారు .మరోసారి అలా ప్రవర్తించట్లేదని .. అందులో టీడీపీ క్యాడర్ స్డైర్యం తగ్గిపోతోందని చెబుతారు. ఈ వారి కూడా … మళ్లీ మొదటి వెర్షన్ వినిపించారు. కాకపోతే కాస్త అడ్వాన్స్ గా ముందుకెళ్లి.. టీడీపీ ఎమ్మెల్యేలు బరి తెగిస్తున్నారని ఆయన ఆరోపించేశారు. చంద్రబాబు రెడ్ బుక్ ఇంప్లిమెటేషన్ కు ఇంకా అనుమతి ఇవ్వలేదని అందుకే ఇంకా అసలైన కేసులు ప్రారంభం కాలేదని ఆర్కే చెబుతున్నారు.
నిజానికి ఘటన జరిగినా దానికి రెండు కోణాలుంటాయి. గుంటూరు ఎమ్మెల్యే భర్త రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కానీ.. ప్రత్తిపాటి పుల్లారావు భార్య ఓవరాక్షన్ లో కానీ.. రెండో కోణం కూడా ఉంటుది. దాన్ని చెప్పేందుకు ఆర్కే ఏ మాత్రం ఇష్టపడకపోగా.. ఇలాంటి వార్తలు ఆంధ్రజ్యోతిలో వస్తే ఎంత డ్యామేజ్ అవుతుందో తెలుసా అని శాంపిల్ చూపించేందుకు రాశామన్నట్లుగా సంకేతాలు ఇచ్చారు. తాను హెచ్చరిస్తున్నట్లుగా చెప్పుకునేందుకు.. పవన్, చంద్రబాబుల మధ్య చర్చ జరిగిదని కూడా చెప్పుకొచ్చారు. నిజానికి ప్రభుత్వానికి.. ప్రభుత్వ పెద్దలకు తెలియని ఆంద్రజ్యోతికి తెలుస్తుందా ?. కానీ ఆర్కే ప్రయత్నం ఆర్కేది.
జత్వానీ కేసులో కూడా ఆర్కే చాలా పాయింట్లను మిస్సయ్యారు. ఆమె క్యారెక్టర్ పై నిందలేస్తున్న వారిపై ఎదురుదాడి చేశారు కానీ… ఆమె ఎలాంటిదైనా సరే… ఆమె హక్కుల్ని హరించి తప్పుడు కేసులు పెట్టి… కిడ్నాప్ చేసి తీసుకొచ్చే హక్కు, అధికారం ఏపీ పోలీసులకు ఉండదు. ఈ విషయాన్ని గట్టిగా చెప్పలేకపోయారు. పైగా పారిశ్రామిక వేత్తలతో టచ్లో ఉంటుందన్నట్లుగా చెప్పుకొచ్చారు. అది ఆమె వ్యక్తిగత విషయం. కానీ ఇక్కడ జత్వానీ విషయంలో జరిగింది మాత్రం అత్యంత ఘోరం. మాఫియాను మించి నేరం. దాన్ని ఆర్కే బలంగా చెప్పలేకపోయారు.
రేవంత్ రెడ్డికి కూల్చివేతల విషయంలో హైకమాండ్ భరోసా లభించిందని కూడా ఆర్కే చెబుతున్నారు. పళ్లం రాజు సోదరుడి నిర్మాణాలు కూల్చేసిన తర్వాత హైకమాండ్ పిలిచి గట్టిగానే చెప్పిందని..కానీ రాహుల్ రేవంత్ కు సపోర్టుగా ఉన్నారని అంటున్నారు. ఇక్కడా ఆయన రేవంత్ వ్యూహాన్ని సరైన దిశగా విశ్లేషించడంలో ఆసక్తి కనబర్చలేదని అర్థమైపోతూనే ఉంటుంది. కూల్చివేతలతో రేవంత్ ఏం సాధించబోతున్నారో చెప్పలేకపోయారు.
మొత్తంగా ఆర్కే వీకెండ్ కామెంట్స్ లో గతంలో ఉన్నంత పదును ఉండటం లేదు..బహుశా.. రెండు రాష్ట్రాల్లోనూ ఇష్టమైన ప్రభుత్వాలే ఉండటం కారణం కావొచ్చు.