అసాధారణ వర్షాలు పడ్డాయి. వాగులు, వంకలు పొర్లుతున్నాయి. ఇలాంటి సమయంలో ఎవరైనా అందరూ సేఫ్ గా ఉండాలనుకుంటారు. కానీ ఏపీలో ఓ ప్రత్యేకమైన వర్గం ఉంటుంది. వారు ఎవరు పోతారా.. ఎవరి ఇల్లు మునిగిపోతుందా.. వారి ఇల్లు మునిగిపోదా.. అమరావతి మునిగిపోదా అని ఆత్రుతగా ఎదురుచూస్తూంటారు. ఉగ్గబట్టుకోలేక ఫేక్ ఫోటోలు తీసి మునిగిపోయిందని ప్రచారం చేసుకుంటూ ఉంటారు.
ఎస్ఆర్ఎమ్ యూనివర్శిటీని నీరు చుట్టుముట్టాయని.. పొలాలను చూపించేసి భ్రమ పెట్టేస్తున్నారు. పొల్లాల్లో నిలిచిన నీళ్లు చూపించి అమరావతి మునిగిపోయిందంటారు. నిజానికి ఇంకా అమరావతి ప్రాంతంలో జంగిల్ క్లియరెన్స్ పూర్తిగా చేయలేదు. అయినా ఎక్కడెక్కడో పొలాల్లో ఉన్న నీళ్లు చూపించి అమరావతి మునిగిపోయిందంటారు. చంద్రబాబు ఇంట్లోకి నీళ్లొచ్చాయని మరికొందరి సైకోలు ప్రచారంచేస్తూంటారు. పన్నెండు లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఉన్నప్పుడే చంద్రబాబు ఇంట్లోకి నీరు రాలేదు. ఇప్పుడు ఐదారు లక్షలే. అయినా వారిదో ఆత్రం.
మన రాష్ట్రం.. మన జనం.. మన ప్రజలు అనుకునే పరిస్థితే లేదు. నాశనమైపోవాలని కోరుకునేవారిదో ప్రత్యేక జాతి. వారు కోరుకున్న వారు పాలనలో ఉన్నప్పుడుతాము ఎవరైతే నాశనమైపోవాలని కోరుకున్నామో వారిని టార్గెట్ చేస్తే కేరింతలు కొట్టారు. తమ గోచీ లాగేశారని తెలుసుకోలేకపోయారు. తెలుసుకున్న వాళ్లు ప్రభుత్వాన్ని పాతాళంలోకి దింపారు. తెలుసుకోలేనివఆళ్లు ఇప్పటికీ. వేరే వారి నాశనం కోరుకుంటూ… సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకుంటున్నారు. అదే ఏపీ దౌర్భాగ్యం.