హైదరాబాద్ ఇప్పుడు ఆకాశ హర్మ్యాల చిరునామాగా మారుతోంది. ముఖ్యంగా అత్యంత లగ్జరీ నివాస ప్రాంతంగా మారుతున్న కోకాపేటలో హై రైజ్ అపార్టుమెంట్లు పెరుగుతున్నాయి. హైదరాబాద్లో అతి ఎత్తయిన అపార్టుమెంట్ గా నిర్మాణం అవుతోంది SAS క్రౌన్. కోకాపేట గోల్డెన్ మైల్ రోడ్లో నిర్మాణం అవుతున్న ఈ అపార్టుమెంట్ లగ్జరీకి మరో పేరుగా నిలుస్తోంది. నాలుగున్నర ఎకరాల్ల ఐదు టవర్లు నిర్మిస్తున్నారు. మొత్తం అరవై అంతస్తుల నిర్మాణం.
ఐదు టవర్లు … అరవై అంతస్తులు అయినప్పటికీ .. యూనిట్స్ చాలా తక్కువ. ఎందుకంటే ఇవి అత్యంత స్పేసియస్ అపార్టుమెంట్లు. కనీసం ఓ ఆపార్టుమెంట్ 6565 స్క్వేర్ ఫీట్స్ ఉంటుంది. అంటే సాధారణ టూ బెడ్ రూం అపార్టుమెంట్లు వెయ్యి ఎస్ఎఫ్టీ అయితే.. ఏడు అపార్టుమెంట్లు కలిస్తే ఒకటన్నమాట. అతి పెద్దది 8811 Sft ఉంటుంది. అంతర్జాతీయస్థాయి ఆర్కిటెక్చరల్ డిజైన్లతో నిర్మాణం పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే అత్యధిక ఫ్లాట్లు బుక్ అయినట్లుగా తెలుస్తోంది.
కోకాపేట వైపు నుంచి ఔటర్ రింగ్ రోడ్ వైపు వెళ్తూంటే..ఈ అరవై అంతస్తుల నిర్మాణం కనిపిస్తుంది. యాభై అంతస్తుల పైన నివాసం ఉంటే హైదరాబాద్ మొత్తం కనిపిస్తుంది. ఈ అపార్టుమెంట్ కాంప్లెక్స్ ప్రారంభించి బుకింగ్స్ ప్రారంభించినప్పుడు ఐదు నుచి ఏడు కోట్ల వరకూ ఒక్కో ఫ్లాట్ ను బుక్ చేసుకున్నారు. ఇప్పుడు అది ఎనిమిది నుంచి పది కోట్లకు చేరిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.