హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలను నేలమేట్టం చేసేందుకు తీసుకొచ్చిన హైడ్రాలాంటి వ్యవస్థను జిల్లాలోనూ ఏర్పాటు చేయాలనే డిమాండ్ లు పెద్దఎత్తున వస్తున్నాయి. హైడ్రాపై రాజకీయ విమర్శలు ఎలా ఉన్నా.. మెజార్టీ ప్రజలు మాత్రం స్వాగతిస్తున్నారు. అందులో భాగంగా జిల్లాకో హైడ్రాను ఏర్పాటు చేయాలనే డిమాండ్ లు రోజురోజుకు పెరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే హైడ్రాను జిల్లాలకు విస్తరించనున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ కోసం తీసుకొచ్చిన హైడ్రా ద్వారా సత్ఫలితాలు వచ్చాయని..జిల్లాలోనూ హైడ్రా తరహ వ్యవస్థలను ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి సంకేతాలు ఇచ్చారు. చెరువుల ఆక్రమణలతో తీవ్ర నష్టం జరుగుతోందని.. అందుకు అడ్డుకట్ట వేసేందుకు హైదరాబాద్ లో హైడ్రాను తీసుకొచ్చామని వ్యాఖ్యానించారు.
హైడ్రా తరహ వ్యవస్థను జిల్లాలకు విస్తరించాలానే డిమాండ్లు ఉన్నాయన్నారు రేవంత్. అయితే, హైడ్రా తరహలో జిల్లాలోనూ ప్రత్యేక వ్యవస్థను తీసుకురావాలని భావిస్తే.. మొదటి వ్యవస్థ ఖమ్మం జిల్లాలోనే ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది. అదే సమయంలో ఇప్పటికే అక్కడ కాలువలను ఆక్రమించి మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నిర్మాణాలు చేపట్టారని , ఈ కారణంగానే భారీ స్థాయిలో ముంపుకు ఖమ్మం జిల్లా గురైందని తమకు ఫిర్యాదు అందిందన్నారు.
దీంతో అక్రమ నిర్మాణాల అంతు తేల్చేందుకు జిల్లాలో ఏర్పాటు అయ్యే వ్యవస్థ మొదటి టార్గెట్ పువ్వాడదే అవుతుందన్న టాక్ నడుస్తోంది.