వైసీపీ పాతాళంలోకి పడిపోయాక.. ఆ పార్టీకి ఆ దుస్థితికి రావడానికి ఎవరు కారణం అని వచ్చిన విశ్లేషణల్లో కొన్ని నోళ్ల గురించి చెప్పుకున్నారు. కొడాలి నాని, పేర్ని నాని వంటి వారితో పాటు ఈ జాబితాలో అగ్రస్థానం సంపాదించుకుంది రోజా. ఆమె నోటి దెబ్బకు పార్టీకి చాలా నష్టం జరిగిందని అందరూ విశ్లేషించారు. ఆమె నోరు విప్పితే అసభ్యత.. చేతల్లో జుగుప్సాకరం కనిపిస్తుంది. ఓడిపోయాక తమిళనాడు రాజకీయాల్లోకి పోదామనుకుని ప్రయత్నించి కుదరక వచ్చేసిన రోజా మళ్లీ గొంతెత్తడం ప్రారంభించారు.
వరదలకు చంద్రబాబే కారణం అంటూ ఆమె మీడియా సమావేశం పెట్టి.. తాను మాట్లాడితే ఎంత కంపు వస్తుందో అంతా చేశారు. ఆమెతో కూడా మాట్లాడించాల్సిన పరిస్థితికి వచ్చిన వైసీపీని చూసి ఆ పార్టీ నేతలు కూడా జాలిపడాల్సి వస్తోంది. నిన్నటి వరకూ పేర్ని నాని.. తర్వాత రోజా.. రేపోమాపో కొడాలి నాని కూడా రంగంలోకి దించితే.. ఇక అసలు క్యాడర్ కు హోప్స్ లేకుండా పోతాయన్న సెటైర్లు వినిపిస్తున్నాయి.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అయినా కాస్త సెన్సిబుల్ మాట్లాడే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి లాంటి వారిని ప్రోత్సహించి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా ప్రయత్నించాలి కానీ.. ఇలా రోజాల్ని..నానిల్ని తెచ్చి గత తప్పులే చేస్తూంటే.. ప్రజలు మాత్రం పాతవి ఎలా మర్చిపోతారన్న నిస్ప్రహ వారిలో కనిపిస్తోంది.