అతిశయోక్తి అనిపించినా ఇప్పుడు ఇదే అంశంపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో వరుసగా ఎదురుదెబ్బలు తగిలిన బీఆర్ఎస్ కు రాజకీయం చేసేందుకు ఛాన్స్ లభిస్తున్నా..కేసీఆర్ మాత్రం గ్రౌండ్ లోకి దిగకపోవడం సొంత పార్టీలోనే అసంతృప్తి వ్యక్తం అవుతోంది.
మాట మాట్లాడితే రైతుల గురించి మాట్లాడే కేసీఆర్… ఇటీవల వర్షాలతో రైతాంగానికి తీవ్ర నష్టం వాటిల్లినా ఫామ్ హౌజ్ వీడటం లేదు.. సర్కార్ ను రైతులకు అండగా ఉండాలని బయటకొచ్చి కనీసం ఓ ప్రకటన కూడా విడుదల చేయకపోవడం పట్ల పార్టీ శ్రేణులు నివ్వెరపోతున్నాయి.
వరదలతో తెలంగాణ అతలాకుతలం అవుతుంటే కేసీఆర్ ఎక్కడ?కేటీఆర్ అమెరికాలో జల్సాలు చేస్తారా? అంటూ ఇప్పటికే కాంగ్రెస్ కేసీఆర్ ఫ్యామిలీపై విమర్శల దాడి కొనసాగిస్తోంది. కానీ, బీఆర్ఎస్ నుంచి ఆశించిన మేర ప్రతిఘటన లేకపోవడంతో ఆ పార్టీని డిఫెన్స్ లో పడేస్తోంది. ఇన్నాళ్లు కేసీఆర్ మౌనం వ్యూహాత్మకం అనుకున్నా… ఇప్పుడూ అదే సైలెన్స్ కొనసాగించడం ఏంటని పార్టీలోనే చర్చ జరుగుతోంది.
కాంగ్రెస్ ను కార్నర్ చేసేందుకు అవకాశం కళ్ల ముందు కనిపిస్తున్నా…కేసీఆర్ మాత్రం స్లో అండ్ స్టడీ వ్యూహంతో పార్టీ మరింత నష్టపోవడం తప్పా ప్రయోజనం లేదని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
క్యాడర్ అభిలాషిస్తోంది..నేతలు గట్టిగా కోరుకుంటున్నారు..కొన్ని చోట్ల రైతులు ఎదురు చూస్తున్నారు..అయినా కేసీఆర్ మాత్రం ప్రజా క్షేత్రంలోకి వచ్చేందుకు ఇంకా సంకోచించడం ఏంటో కేసీఆర్ కు తెలియాలి!