ప్రపంచంలోని మేటి ఆటగాడిగా దూసుకపోతున్న క్రికెటర్ విరాట్ కోహ్లీ ఈ ఏడాది ఎంత ఆదాయపు పన్ను కట్టారో తెలుసా…? క్రికెట్ ఆటగాడిగా బీసీసీఐ, ఐపీఎల్ తో పాటు ప్రముఖ బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న కోహ్లీ ఈసారి ఏకంగా 66కోట్లు పన్ను కట్టారు.
ఈ ఏడాది అత్యధిక ఆదాయపు పన్ను కట్టిన తొలి ఐదు స్థానాల్లో సినీ, స్పోర్ట్ స్టార్స్ జాబితా చూస్తే…
షారుఖ్ ఖాన్- 92 కోట్లు
హీరో విజయ్- 80 కోట్లు
సల్మాన్ ఖాన్- 75 కోట్లు
అమితాబ్ బచ్చన్ – 71 కోట్లు
విరాట్ కోహ్లీ – 66కోట్లు ఉన్నారు.
ఇక, ఎంఎస్ ధోనీ 38కోట్లు పన్ను కట్టగా, మరో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ 42కోట్లు, రణబీర్ కపూర్ 36కోట్ల రూపాయల పన్నులు చెల్లించారు.
క్రికెటర్లలో సచిన్ 28కోట్లు, గంగూలీ 23కోట్లు, హర్ధిక్ పాండ్యా 13కోట్లు పన్ను కట్టారు.
తెలుగు సినీ ఇండస్ట్రీ నుండి అల్లు అర్జున్ 14కోట్ల రూపాయల ఆదాయపు పన్ను కట్టారు.