లైంగిక వేధింపుల వివాదంలో ఇరుకుపోయిన సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంను పార్టీ నుంచి బహిష్కరిస్తూ టీడీపీ నిర్ణయం తీసుకుంది. తనను వేధించి లోబర్చుకున్నారని మహిళా ఆరోపించడంతో ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న హైకమాండ్ వెంటనే ఎమ్మెల్యేపై వేటు వేసింది.
తనను ఎమ్మెల్యే వేధించారని మహిళా వీడియోలు బయట పెట్టడంతో ఈ విషయంపై తీవ్ర దుమారం రేగింది. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే నుంచి వివరణ కూడా తీసుకోకుండానే ..ఇలాంటి చర్యలను ఏమాత్రం ఉపేక్షించవద్దని టీడీపీ అధిష్టానం చర్యలు తీసుకుంది.
మహిళపై అసభ్యంగా ప్రవర్తించినందుకు పార్టీ క్రమశిక్షణ చర్యల్లో భాగంగా సస్పెన్షన్ వేటు వేసింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రకటించారు. ఎమ్మెల్యే ఆదిమూలం లైంగిక వేధింపుల వీడియోను సదరు మహిళ మీడియా సమక్షంలో బయట పెట్టిన విషయం తెలిసిందే.