జాతిరత్నాలు సినిమాతో ‘చిట్టి’గా తెలుగు ప్రేక్షకులకు పరిచమైయింది ఫరియా అబ్దుల్లా. ఆ పాత్రలోని అమాయకత్వం ప్రేక్షకులు తెగ నచ్చేసింది. నిజానికి ఫారియా మల్టీ ట్యాలెంటెడ్. కానీ ఇప్పటివరకూ ఆమెకు కొంచెం కామెడీ టచ్ వున్న పాత్రలే వచ్చాయి. అయితే ఇప్పుడు యాక్షన్ లోకి దిగింది. మత్తువదలరా 2లో ఏజెంట్ గా ఫైట్లు చేయబోతోంది ఫారియా. ఈ పాత్ర గురించిన చెబుతూ ‘మత్తువదలరా2 నాకు నచ్చిన పాత్ర చేశా. ఇప్పటివరకూ పక్కింటి అమ్మాయిలాంటి పాత్రలే వచ్చాయి. కానీ నాకు యాక్షన్ ఇష్టం. ఆ అవకాశం ఈ సినిమా ఇచ్చింది’అని చెప్పింది.
ఫారియాకి చిన్నప్పటి నుంచి రైటింగ్ ఇష్టం. ఈ సినిమాలో ఆమెకు పాట రాసే అవకాశం వచ్చింది. స్వయంగా పాడటంతో పాటు కొరియోగ్రఫీ చేసింది. అంతేకాదు ఫారియాకి డైరెక్షన్ చేయాలని వుంది. ఈ విషయంలో ఆమెకు ప్రత్యేక ఆసక్తి వుంది. దీని గురించి చెప్తూ”నాకు రైటింగ్, డైరెక్షన్ అంటే కష్టం. అయితే నాకు డైరెక్షన్ పై ఆసక్తి వుందని చెప్తే నటిగా అవకాశాలు తగ్గే ఛాన్స్ వుంది. దర్శకులు వారి సినిమాల్లో నన్ను సంప్రదించకపోవచ్చు. అందుకే నా ఆసక్తి బయటపెట్టుకోవడం లేదు. అయితే భవిష్యత్ లో తప్పకుండా డైరెక్టర్ గా ప్రయత్నిస్తాను’ అని చెప్పుకొచ్చింది ఫారియా. మత్తువదలరా 2 సెప్టెంబర్ 13న రాబోతున్న సంగతి తెలిసిందే.