మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటన్న సత్యవేడు ఎమ్మెల్యేను గంటలోనే చంద్రబాబు సస్పెండ్ చేశారు. వివరణలు ఏమైనా ఉంటే.. తర్వాత తీసుకోవాలని డిసైడయ్యారు. అదే ఆయన వైసీపీలో ఉంటే ఖచ్చితంగా ఆ మహిళపై ఆరోపణలు చేసి తమ ఎమ్మెల్యే స్వాతి ముత్యమని ప్రకటించి సర్టిఫికెట్ జారీ చేసి.. ప్రమోషన్ కూడా ఇచ్చేవారన్న అభిప్రాయం సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తోంది. దీనికి కారణం గత అనుభవాలే.
గోరంట్ల మాధవ్ వీడియో వెలుగులోకి వచ్చినప్పుడు అసహ్యంగా సమర్థించుకున్నారు.చివరికి సీఐడీని కూడా సర్టిఫికెట్ ఇవ్వడానికి వాడుకున్నారు. కానీ విచారణ మాత్రం చేయలేదు. ఇక గంట అవంతి శ్రీనివాస్, అర గంట అంబటి రాంబాబు ఆడియోలు వైరల్ అయినప్పుడూ అంతే.పైగా రాంబాబుకు ప్రమోషన్ ఇచ్చారు. ఇక మరో సంచలనం రేపిన హత్య కూడా చేసిన ఎమ్మెల్సీ అనంతబాబును జగన్ తన అంతరంగీకుల్లో ఒకరిగా మార్చుకున్నారు. ఆయన వీడియో ఇటీవల వైరల్ అయింది.
ఇక హీరోయిన్ జత్వానీ కేసులో నగ్నంగా కనిపించిన కుక్కల విద్యాసాగర్ కు పరమ మంచోడన్న సర్టిఫికెట్ ఇచ్చి హీరోయిన్ ను మాయలేడిగా చెబుతూ..వైసీపీ మీడియా చేసిన హడావుడి గురించి చెప్పాల్సిన పని లేదు. ఇప్పడు ఆదిమూలం ఆ పార్టీలో ఉంటే.. ఇంకో షో చేసి ఉండేవారు. ఆమె ను బ్లాక్ మెయిలర్ గా చూపించి..ఎమ్మెల్యేకు మంచి పదవికి కట్టబెట్టారు.