రూ. వంద కోట్ల విలువ చేసే ఇల్లు ఉంటుందా ?. ఖరీదైన ప్రాంతంలో రెండెకరాల ఫామ్ హౌస్ కూడా అంత ఉండదనుకుంటారు. కానీ ఒక్క హైరైజ్ అపార్టుమెంట్లో ఫ్లాట్లే రూ. వంద కోట్లకు అమ్ముతున్నారట. ఇవి హైదరాబాద్‌లో కూడా ఉన్నాయి. అనరాక్ అనే రియల్ ఎస్టేట్ వ్యవహారాల ఎనలైజింగ్ సంస్థ సంచలన విషయాలను బయట పెట్టింది. అత్యంత ఖరీదైన ఇళ్ల రిజిస్ట్రేషన్ల ను విశ్లేషించి… అల్ట్రా లగ్జరీ ఇళ్ల గురించి వెల్లడించింది.
దేశంలో పారిశ్రామిక వేత్తలు ఎక్కువగా ముంబైలో ఉంటారు. అక్కడ సొంత బంగ్లాలు ఉండేది తక్కువ. అంతా అపార్టుమెంట్లలోనే. సినీతారలు, పారిశ్రామిక వేత్తలు వందకోట్లు వెచ్చింది జూహూలోనో… మరో చోటో… పదిహేల ఎస్ఎఫ్టీ అపార్టుమెంట్ కొనుగోలు చేశారని షో బిజ్ పత్రికల్లో వస్తూ ఉంటాయి. సహజంగానే అక్కడ వాటికి డిమాండ్. ముంబై తర్వాత అలాంటి డిమాండ్ ఉంది హైదరాబాద్‌లోనేనని అనరాక్ తెలిపింది.
ఈ ఏడాది ఇప్పటి వరకూ జరిగిన ముంబై, గురుగ్రామ్, హైదరాబాద్, బెంగళూరు నాలుగు నగరాల్లో హైరైజ్ అపార్టుమెంట్లలో జరిగిన అత్యంత ఖరీదైన ఇరవై లావాదేవీలు అంటే.. ఇరవై ఏళ్ల రిజిస్ట్రేషన్ల విలువ మొత్తం 1694 కోట్ల రూపాయలు. అంటే ఒక్కో అపార్టుమెంట్ యావరేజ్‌గా రూ. ఎనభై నాలుగు కోట్లు. వంద కోట్లకు పైబడిన ఒప్పందాలు తొమ్మిది ఉన్నాయని అనరాక్ తెలిపింది. ముంబై తర్వాత హైదరాబాద్‌లోనే ఈ ఒప్పందాలు ఎక్కువగా ఉన్నాయి.
అంటే ఇళ్ల మార్కెట్లో అత్యంత విలాసవంమైన ఇళ్లకు డిమాండ్ అనూహ్యంగా పెరుగుతున్నారు. నయా బిలియనీర్లు అవతరిస్తున్నారు. వారంతా అల్ట్రా లగ్జరీకి ప్రాధాన్యం ఇస్తున్నారు. వారి అవసరాల్ని తీర్చేందుకు రియల్టర్లు కూడా రెడీగా ఉన్నారు.