వరద బాధితుల కోసం చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలకు .. దాతల విరాళాలు తోడవుతున్నాయి. పెద్ద ఎత్తున స్వచ్చందంగా తరలి వచ్చి విరాళాలిస్తున్నారు. శుక్రవారం ఒక్క రోజే..ఏపీ ప్రభుత్వానికి రూ. 30 కోట్లకుపైగా వ్యక్తిగత విరాళాలు వచ్చాయి. ప్రతి రోజూ.. చంద్రబాబును కలిసి చెక్కులు ఇచ్చేందుకు పలువురు వస్తున్నారు. వారి కోసం చంద్రబాబు కనీసం గంట సమయం కేటాయిస్తున్నాయి.
ప్రభుత్వానికి విరాళాలు ఇచ్చే వారే కాదు.. నేరుగా జమ చేసేవారు కూడా ఎక్కువగానే ఉన్నారు . సీఎంఆర్ఎఫ్కు జమ చేయాలంటే గతంలో ఎవరూ స్పందించేవారు కాదు. కానీ ఇప్పుు మాత్రం సామాన్యులు కూడా స్పందిస్తున్నారు. మరో వైపు స్వచ్చందంగా విజయవాడలో సేవలు చేసేవారు.. నిత్యావసర వస్తువుల కిట్లు పంచేవారు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారంతా స్వచ్చంద సంస్థల తరపున సాయం చేస్తున్నారు.
విజయవాడ ప్రజలకు తామున్నామంటూ పెద్ద ఎత్తున వస్తున్న సాయం చూసి.. అక్కడి ప్రజలకు కూడా సంతృప్తి లభిస్తోంది. వరదల్లో చాలా పోగొట్టుకున్నామన్న భావన కన్నా తమ కోసం చాలా మంది ఉన్నారన్న నమ్మకం వారికి మరింత ధైర్యాన్నిస్తోంది.