త్వరలో ఉత్తమ్ రెడ్డి సీఎం . నా నాలుకపై మచ్చలున్నాయని రాజగోపాల్ రెడ్డి వంటి వాళ్లు … తమ పార్టీలో ఏదో జరిగిపోతోందని చెప్పడానికి ట్రై చేస్తూనే ఉన్నారు.. కానీ రేవంత్ రెడ్డి మాత్రం.. తన మార్క్ రాజకీయాలు తాను చేసుకుంటూ పోతున్నారు. తాము ఆవేశపడిపోతున్నాము కానీ.. తమను రేవంత్ పాతాళంలోకి తొక్కేస్తున్నాడని ఇలాంటి సీనియర్లకు.. ఇప్పుడప్పుడే తెలుస్తోంది.
పీసీసీ చీఫ్ గా మధుయాష్కీని పెట్టేలా చేసుకుని… రేవంత్ కు ప్రతి విషయంలోనూ అడ్డం పడాలని ఆయనను బలహీనపరచాలని గట్టి ప్రయత్నాలు చేసిన సీనియర్ల రాజకీయానికి. . రేవంత్ తనదైన మార్గంలోనే చెక్ పెట్టారు. రేవంత్ బీజేపీకి దగ్గరవుతున్నాడని.. బీఆర్ఎస్ చేసే ప్రచారాన్ని కాంగ్రెస్ సీనియర్లు కాంగ్రెస్ హైకమాండ్ వద్దకు పలుమార్లు తీసుకెళ్లారు. హైడ్రా కూల్చివేతల విషయాన్నీ వ్యతిరేకించారు. రేవంత్ పై లెక్కలేనన్ని ఫిర్యాదులు చేశారు. చివరికి ఏవీ వర్కవుట్ కాలేదు. పీసీసీ చీఫ్ గా రేవంత్ చాయిస్ కే హైకమాండ్ ప్రాధాన్యత ఇచ్చింది.
ఇప్పుడు సీనియర్లకు మరో దారి లేదు. కానీ ఇప్పటికే రేవంత్ ను వ్యతిరేకం చేసేసుకున్నారు. ఆయన బయట వ్యక్తి అని.. బీజేపీలోకి పోతారని ఎంత చెప్పినా హైకమాండ్ నమ్మలేదంటే.. తమపై నమ్మకం లేదని .. వారికి క్లారిటీ వచ్చి ఉండాలి. రేవంత్ వద్ద ఇప్పుడు పలుకుబడి పెంచుకోకపోతే.. సీనియర్లందరికీ.. రేవంత్ పొలిటికల్ స్పాట్ డిసైడ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.