వైసీపీ ముఖ్య నేతల్లో చాలా మంది ఇప్పుడు ఆజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అరెస్టులు చేస్తారేమోనని భయంతో ఫోన్లు స్విచ్చాఫ్ చేసి.. ఎవరికీ అందుబాటులో లేకుండా పోయారు. చంద్రబాబు ఇల్లు, టీడీపీ ఆఫీసుపై దాడి ఘటనల్లో కేసులు నమోదవడమే దీనికికారణం. కోర్టు అరెస్టు నుంచి రక్షణ కల్పించడానికి నిరాకరించడంతో వారికి మరో దారి లేకపోయిపోయింది. అసలు వారెందుకు టీడీపీ కార్యాలయంపై దాడి చేశారు ?. చంద్రబాబు ఇంటిపైకి ఎందుకు వెళ్లారు అంటే.. సజ్జల రామకృష్ణారెడ్డి ఈగో అని చెప్పక తప్పదు.
ఓ రోజు టీడీపీ ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టిన పట్టాభి సజ్జల రామకృష్ణారెడ్డిని భోషడీకే అని తిట్టారు. ఆయన ఎవర్ని తిట్టారో .. ఆయనప్రెస్ మీట్ విన్న వారికి అర్థమైపోతుంది. తనను బోషడీకే అని తిట్టడాన్ని సజ్జల జీర్ణించుకోలేకపోయారు. నిజానికి అది బూతేమీ కాదు. అక్కడ ఆయన కుట్రల నిపుణుడు నిద్రలేచాడు. వెంటనే తన చేతుల్లో ఉండే సాక్షి మీడియా, సోషల్ మీడియాలో జగన్ నే బోషడికే అని తిట్టారని ప్రచారం చేయించారు. జగన్ కూ అదే చెప్పారు. మిమ్మల్ని ఫలానా విధంగా తిట్టారని చెప్పాడు. ఆ తిట్టును జగన్ స్వయంగా తర్వాత పోలీసు కార్యక్రమంలో పాల్గొని సిగ్గులేకుండా చెప్పుకున్నారు కూడా.
జగన్ రెడ్డినే తిట్టారని చెప్పి సజ్జల పార్టీ నేతలందర్నీ పోగెసి.. టీడీపీ ఆఫీసుపై.. పట్టాభిపై దాడికి రెడీ చేయించారు. ఇక్కడ సజ్జల ఏం చెబితే అది జరుగుతుంది కాబట్టి బ్లేడ్ , గంజాయి బ్యాచుల్ని మెయిన్ టెయిన్ చేసే దేవినేని అవినాష్ , నందిగం సురేష్, లేళ్ల అప్పిరెడ్డి వాళ్లు చెలరేగిపోయారు. ఇప్పుడు జైళ్లలో ల్యాండ్ అవుతున్నారు. తనను అన్నా.. జగన్ ను బోషడీకే అన్నారని.. ప్రచారం చేసుకుని ..తన కోపం తీర్చుకున్న సజ్జల హాయిగా ఉన్నారు. నేతలంతా జైలుకు పోతున్నారు.