ప్రకాశం బ్యారేజీకి వరద వస్తే ఈ మధ్య బోట్లు కొట్టుకు వస్తున్నాయి. బ్యారేజని డ్యామేజ్ చేస్తున్నాయి. అవి ఎలా వస్తున్నాయో తెలియడం లేదు. ఇప్పుడు మిస్టరీ బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ రంగులేసిన మూడు బోట్లు నిండా ఇసుకతో వరదలు వచ్చినప్పుడు కొట్టకు వచ్చాయి. వాటి వల్ల బ్యారేజీ డ్యామేజీ అయింది. ఇప్పుడు ఇన్ ఫ్లో తగ్గడంతో వాటిని బయటకు తీసి బ్యారేజీకి రిపేర్లు చేసే ప్రయత్నం చేస్తున్నారు.
అదే సమయంలో.. కుట్ర కోణంపై అనుమానంతో జల వనరుల శాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ బోట్లు ఎవరివి.. ఇప్పుడు ఏ అవసరాల కోసం నడుపుతున్నారు.. వాటిని ఎందుకు అలా వదిలేశారన్నదానిపై ఆరా తీస్తున్నారు. ఆ బోట్లు వైసీపీకి చెందిన వారివేనని.. ప్రస్తుతానికి మాజీ ఎంపీ నందిగం సురేష్.. ఇసుక రవాణా కోసం వాడుతున్నారని తేలింది. దీంతో పోలీసులు అసలు కుట్ర కోణంపై లోతైన విచారణ జరుపుతున్నారు. కావాలనే వదిలి పెట్టారా లేకపోతే.. నిర్లక్ష్యంగా వదిలేయడం వల్ల కొట్టుకు వచ్చాయా అన్నది తేల్చబోతున్నారు.
ప్రకాశం బ్యారేజీ నిర్మించిన తర్వాత ఎన్నో సార్లు వరదలు వచ్చి ఉంటాయి.. ఇలా గేట్లను డ్యామేజ్ చేసేలా బోట్లు కొట్టుకురావడం మాత్రం ఈ మధ్యనే ప్రారంభమయింది. ఈ గుట్టు బయటకు లాగితే.. అందులో కుట్రకోణం ఉంటే మాత్రం.. అత్యంత ప్రమాదకరమైన పొలిటికల్ గేమ్ ఆడుతున్నట్లే అనుమానించాల్సి ఉంటుంది.