కోల్ కతా రేప్ కేసులో తృణమూల్ ను ఇబ్బంది పెడదామని అనుకుని చేసిన ఓవరాక్షన్ ఇప్పుడు బీజేపీ కి సమస్యగా మారింది. ఆ కేసు సీబీఐకి వెళ్లిన తర్వాత అందరూ కేంద్రాన్నే ప్రశ్నించడం ప్రారంభించారు. సీబీఐకి చేతకావడం లేదా అని మండి పడుతున్నారు. సీబీఐకి అసలు క్లూలే దొరకడం లేదు. నేరం ఎలా జరిగిందో కూడా చెప్పలేకపోతున్నారు. మరో వైపు ప్రజల ఆగ్రహం మాత్రం చల్లారడం లేదు. చల్లారకుండా తృణమూల్ దీదీ తాను చేయాలనుకున్నది చేస్తున్నారు.
ఈ ఒత్తిడి తట్టుకోలేక సీబీఐ..ఒక్కొక్క లీక్ ఇస్తోంది. మహిళా డాక్టర్ ది గ్యాంగ్ రేప్ కాదని నిర్దారించారు. బయట ప్రచారం చేసిన ఘోరమైన మర్డర్ కాదని మరోసారి లీకులిస్తున్నారు. అంటే.. డాక్టర్ హత్యాచారం తర్వాత బీజేపీ చేసిన ప్రచారం అంతా ఫేక్ ప్రాపగాండా అని సీబీఐనే పరోక్షంగా చెబుతున్నట్లయింది. నిందితుడ్ని కోల్ కతా పోలీసులు ఎప్పుడో అరెస్టు చేసినా.. అతని వద్ద నుంచి కొత్త సమాచారం ఏదీ సేకరించలేకపోయారు.
రేపోమాపో చార్జిషీటు దాఖలు చేస్తామని సీబీఐ అధికారులు చెబుతున్నారు. ఆ తర్వాత ప్రజల్లో మరింత ఆగ్రహం పెరుగుతుంది. ఎందుకంటే .. బీజేపీ చేసిన ప్రచారాలకు.. ఆ చార్జిషీటుకు పొంతన ఉండదు. ఓ హత్య ఘటనలో తాను చేసిన రాజకీయం తనకే రివర్స్ అవుతుందని బీజేపీ ఊహించి ఉండదు. అయితే ఆ వైద్యురాలి తల్లిదండ్రులు .. మమతా బెనర్జీ కి.. పోలీసులకు వ్యతిరేకంగా పదే పదే ప్రకటనలు చేస్తూండటం మాత్రం.. దీదీకి ఇబ్బందికరమే. అయితే … ఈ కేసు విషయంలో బీజేపీ జోక్యం చేసుకోకుండా ఉన్నట్లయితే… ఆ ప్రజాగ్రహం ఇంకా మమతా బెనర్జీపై ఎక్కువగా ఉండేది. వ్యూహాత్మక తప్పిదాలు చేయడం బీజేపీకి కామన్ గా మారిపోయిందన్న సెటైర్లు కోల్ కతా ఘటన విషయంలో వస్తున్నాయి.