నాపై ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ దాడి చేశారు… నన్ను చంపేందుకు ప్రయత్నించారు… ఈరోజు దాడిని నేను వదిలిపెట్టా. కచ్చితంగా నేను ప్రతీకారం తీర్చుకుంటానంటూ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి హెచ్చరించారు.
అరికెపూడి గాంధీ తన వెంట రౌడీ షీటర్లను తీసుకొని వచ్చారు, రాళ్లతో దాడి చేసే ప్రయత్నించారు… తాను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని చెప్పిన గాంధీకి కండువా కప్పుకోవటానికి ఇబ్బంది ఏంటీ అని కౌశిక్ రెడ్డి ప్రయత్నించారు. తాను మంగళహరతి ఇచ్చి తన ఇంట్లోకి తీసుకెళ్లి, బీఆర్ఎస్ కండువా కప్పాలనుకున్నానని మీడియాకు వివరించారు.
రేపు మేడ్చల్ పార్టీ ఆఫీసు నుండి తమ పని మొదలవుతుందని, అరికెపూడి గాంధీని వదిలిపెట్టబోనని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు.
అయితే, కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద జరిగిన ఉద్రిక్తతను బీఆర్ఎస్ పార్టీ సీరియస్ గా తీసుకుంది. మాజీ మంత్రి హరీష్ రావు సిద్ధిపేట నుండి కౌశిక్ రెడ్డి ఇంటికి బయల్దేరగా… పార్టీ మారిన ఎమ్మెల్యేల ఇంటికి వెళ్లేలా బీఆర్ఎస్ తదుపరి కార్యాచరణ ఉండేలా కనపడుతోంది.