దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఒక్కొక్కరికీ బెయిల్ వచ్చేస్తోంది. ఇప్పటికే ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం సోసిడియాకు బెయిల్ రాగా, ఆ తర్వాత ఎమ్మెల్సీ కవితతో పాటు అరుణ్ పిళ్లైకి కూడా బెయిల్ వచ్చింది.
తాజాగా ఇదే కేసులో తీహార్ జైల్లో ఉన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు కూడా బెయిల్ వచ్చింది. ఈడీ కేసులో గతంలోనే బెయిల్ రాగా… అప్పటికే సీబీఐ అరెస్ట్ చేయటంతో ఆ కేసులో తాజాగా బెయిల్ వచ్చింది. కుట్రలో కీలకం అని ఈడీ, సీబీఐ ఆరోపించిన ముఖ్యులందరికీ బెయిల్ వచ్చినట్లైంది.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో 100కోట్లు చేతులు మారాయని, ఆ డబ్బునే ఆప్ గోవా ఎన్నికల్లో ప్రచార కార్యక్రమాలకు వాడిందనేది ఈడీ, సీబీఐ ప్రధాన ఆరోపణ. ఇందుకోసమే లిక్కర్ పాలసీని మార్చారని… సీబీఐ ఆరోపించింది.
అయితే, ఇంత వరకు డబ్బు రికవరీ కాకపోవటంతో పాటు దర్యాప్తు ముగిసినందున… దాదాపు గా నిందితులందరికీ బెయిల్ ఇచ్చింది సుప్రీంకోర్టు. ఈ కేసులో ఇప్పటికే చార్జ్ షీట్లు కూడా ఫైల్ అవ్వటంతో బెయిల్ లభించింది.
అప్రూవర్ గా మారిన నిందితుల వాంగ్మూలంపై సుప్రీంకోర్టు గతంలోనే కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో… ఈ కేసును ఈడీ, సీబీఐలు ఎంతవరకు విజయవంతంగా పూర్తి చేస్తాయన్న ఆసక్తి నెలకొంది.