హైదరాబాద్ లో వినాయక చవితి అనగానే ఖైరతాబాద్ వినాయకుడు గుర్తుకొస్తారు. నిమజ్జనం అనగానే ట్యాంక్ బండ్ మదిలో మెదులుతుంది. వేలాది గణనాథులు సాగరతీరాన సందడి చేస్తూ, భారీ జనసందోహ్రం మధ్య సాగరతీరానికి చేరుతాయి. ట్యాంక్ బండ్ పై ఇసుక వేస్తే రాలనంత జనం ఉంటారు.
అయితే, పీఓపీతో వినాయక విగ్రహాలు తయారు చేయటం… వాటిని ట్యాంక్ బండ్ లో నిమజ్జనం చేయటం ద్వారా కాలుష్యం అవుతుందన్న కారణంగా హైకోర్టు పీఓపీ విగ్రహలను ట్యాంక్ బండ్ పై నిమజ్జనం చేయటాన్ని నిషేధించింది. ఈ ఏడాది ఇది అమల్లోకి వచ్చేసింది.
దీంతో పోలీసులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో భాగంగా ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్డులో నిమజ్జన ఏర్పాట్లు చేశారు. మంగళవారం జరిగే నిమజ్జనానికి 18వేల మందితో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు హైదరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు.
ముందస్తు అనుమతి ఉన్న వాహనాలను మాత్రమే అనుమతిస్తామని… డీజేలకు పర్మిషన్ లేదని ఆయన స్పష్టం చేశారు. మద్యం సేవించి వచ్చినా, మత్తు పదార్థాలు వినాయకుడి విగ్రహం ఉన్న ట్రక్కుల్లో ఉన్నా చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు.