వైసీపీ స్వార్థ రాజకీయం ఎలా ఉంటుందో నగరికి చెందిన ఇద్దరు కీలక నేతలు కేజే కుమార్, కేజే శాంతి. వారి కుటుంబసభ్యులందర్నీ పార్టీ నుంచి గెంటేసిన వైనం చూస్తే అర్థమవుతుంది. పార్టీ కోసం కష్టపడిన వారిని తొలగిస్తేనే మళ్లీ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటానని రోజా పెట్టిన షరతుకు హైకమాండ్ తలొగ్గింది. వారి కుటుంబాన్ని పార్టీ నుంచి బహిష్కరించింది.
రోజాకు ఎవరితోనూ సత్సబంధాలుండవు. వైసీపీ నేతలందరితో సున్నం పెట్టుకోవడంతో వారంతా ఎన్నికలకు ముందే పార్టీ మారిపోాయరు. అయితే పెద్దిరెడ్డికి ప్రధాన అనుచరులుగా ఉన్ కేజే శాంతి దంపతులు మాత్రం పార్టీలోనే ఉన్నా.. రోజా కోసం పని చేయలేదు. ఇప్పుడు రోజా తాను మళ్లీ నగరిలో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలంటే వారిని బహిష్కరించాలని షరతు పెట్టి చెన్నైకి వెళ్లి కూర్చున్నారు. చివరికి రోజా షరతును నెరవేర్చారు. పార్టీని నమ్ముకున్న వారిని గెంటేశారు.
రోజా తమిళనాడు రాజకీయాల్లోకి వెళ్తానని ప్రచారం చేసుకున్నారు. విజయ్ పార్టీలో చేరుతానని చెప్పుకున్నారు. సోషల్ మీడియా ఖాతాల నుంచి జగన్ తో పాటు వైసీపీని తొలగించారు. ఇదంతా హైకమాండ్ ను బెదిరించడానికేనని.. తాజా పరిణామాలతో స్పష్టమయిందంటున్నారు. రోజాను సంతృప్తి పర్చడానికి వారిని సస్పెండ్ చేయడం కన్నా.. రోజాను పట్టించుకోకుండా నగరిలో మంచి పట్టు ఉన్న కేజే దంపతులకే ఇంచార్జ్ పోస్టు ఇస్తే బాగుండేదన్న వాదనను కొందరు వినిపిస్తున్నారు.