వైసీపీని బీఆర్ఎస్ ఫాలో అవుతుందో, లేక బీఆర్ఎస్ వైసీపీని ఫాలో అవుతుందో కానీ ఇటీవల రెండూ పార్టీల నుంచి ఒకే రకమైన డైలాగ్ లు పేలుతున్నాయి. మళ్లీ మెమొస్తే అంటూ తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నాయి.
టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో అరెస్టు ఆయిన మాజీ ఎంపీ నందిగం సురేష్ తో ఇటీవల ములాఖత్ అయిన జగన్ బయటకు వచ్చి మళ్లీ మేము అధికారంలోకి వస్తాం…టీడీపీ మాదిరి కేసులు నమోదు చేస్తాం..అప్పుడు జైలు కూడా సరిపోవని హెచ్చరించారు. తాజాగా బీఆర్ఎస్ నేతలు ఇదే రకమైన కామెంట్స్ చేశారు. ఇక తెలంగాణలో అరికపూడి గాంధీ – కౌశిక్ రెడ్డి వివాదంలో తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ…వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, అప్పుడు కాంగ్రెస్ కు , అరికెపూడి గాంధీకి తమెంటో చూపిస్తామని జగన్ తరహాలోనే వార్నింగ్ ఇచ్చేశారు.
తెలంగాణలో కాంగ్రెస్ , ఏపీలో కూటమి ప్రభుత్వాలు ఏర్పడి ఏడాది కూడా కాలేదు..అప్పుడే ప్రత్యర్థి పార్టీలు మేమే అధికారంలోకి వస్తామని , కక్ష సాధింపు చర్యలకు దిగుతామని హెచ్చరించడం పట్ల విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అయినా , పవర్ లోకి వస్తే ప్రతీకారం తీర్చుకుంటామని అంటున్న బీఆర్ఎస్, వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సీరియస్ తీసుకుంటే…ఈ రెండు పార్టీల పరిస్థితి ఎంటనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.