అనూహ్యంగా వరించిన ఎమ్మెల్సీ.. ఆపై మండలిలో ప్రతిపక్ష నేత హోదా. ఇక చెలరేగిపోతాడని భావించిన బొత్స ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు.
తనకు అత్యంత సన్నిహితుడైన అప్పిరెడ్డిని తప్పించి బొత్సను ప్రతిపక్ష నేతగా ప్రతిపాదించడంతో వైసీపీలో ఇక ఆయనే నెంబర్ టూ కాబోతున్నారు అని సంకేతాలు ఇచ్చారు జగన్. దాంతో వైసీపీకి సంబంధించి బొత్స చక్రం తిప్పుతారని అనుకుంటే అంచనాలను తలకిందులు చేస్తూ సైలెంట్ మోడ్ లోకి వెళ్ళిపోయారు.
ఎమ్మెల్సీ అయిన తర్వాత బొత్స మీడియా ముందుకు వచ్చి చాలా రోజులైంది. ఆమధ్య బెజవాడ వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన ఆయనను బాధితులు నిలదీశారు. ఇంత ఆలస్యంగా ఏ మొహం పెట్టుకొని వచ్చారని నిలదీయడంతో చేసేదేం లేక అక్కడి నుంచి వెనుదిరిగారు. అప్పటి నుంచి ఆయన మీడియా ముందుకు రావడం లేదు.. జగన్ తో కలిసి వైసీపీని ముందుకు తీసుకెళ్తారని అనుకుంటే ఆయన గప్ చుప్ కావడం పట్ల పార్టీలో చర్చ జరుగుతోంది.
అయితే ప్రజల నుంచి నిలదీతలు ఎదురవ్వడంతోనే బొత్స సడెన్ సైలెంట్ అయినట్లుగా తెలుస్తోంది. ఈ విషయంపై రాజకీయం చేస్తే ప్రజల్లో మరింత పలుచన అవుతామని…దూకుడుగా రాజకీయం చేయడం వలన ప్రజల నుంచి ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తుంది అని మౌనం వహిస్తున్నారని అంటున్నారు. అదే సమయంలో ఆయన చీపురుపల్లిలో ఓటమి పాలవ్వడంతో అక్కడ అనుచరులను కాపాడుకోవడంపై దృష్టి పెట్టడంతోనే సైలెంట్ అయ్యారని బొత్స సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.