జగన్ రెడ్డి దాన కర్ణుడని… చంద్రబాబు, పవన్ కల్యాణే ప్రజలకు ఏమీ చేయలేదంటూ కొత్తగా వైసీపీ అధికార ప్రతినిధిగా నియమితులైన యాంకర్ శ్యామల షూటింగ్ గ్యాప్ లో ఓ వీడియో చేసి వదిలారు. విజయవాడలో వరద బాధితులు అష్టకష్టాలు పడుతున్నప్పుడు… ఎక్కడున్నారో తెలియదు కానీ.. మాటలొచ్చని పదవి ఇవ్వగానే వీడియో విడుదల చేశారు. ముందుగా ఆమె జగన్ కు సర్టిఫికెట్ ఇచ్చే ప్రోగ్రాం పెట్టుకున్నారు. అందుకే జగన్ దాన కర్ణుడని.. కోటి రూపాయలు ఇచ్చేశాడని చెప్పుకొచ్చారు.
చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు ప్రజలకు ఎంత చేశారో.. ఏం చేశారో ప్రజలకు తెలుసు కానీ.. జగన్ ఏం సాయం చేశాడో శ్యామల చెప్పలేకపోయారు. రూ.కోటి ఇచ్చాడని చెప్పుకొచ్చారు కానీ.. నిజానికి ఆయన ప్రకటించాడు.. ఇంకా ఇవ్వలేదు. దానికో కమిటీ వేస్తానన్నాడు. చిన్న చిన్న పారిశ్రామికవేత్తలు కూడా రూ. కోటి ప్రకటించి చెక్కులు ఇచ్చి వెళ్తున్నారు. కానీ జగన్ మాత్రం.. అధికారంలో ఉన్నప్పుడు సాక్షి పత్రికకు, భారతి సిమెంట్స్ కు ఐదేళ్ల కాలంలో కనీసం నాలుగైదు వేల కోట్ల ప్రజాధనం ఖాతాలో రాయించుకున్నారు కానీ.. ఒక్క రూపాయి కూడా ప్రజలకు ఇవ్వలేదు. పార్టీ తరపున కోటి ప్రకటించి.. దాన్నే ప్రచారం చేసుకుంటున్నారు.
జగన్ రెడ్డి పిల్లికి బిచ్చం పెట్టడని పార్టీలో నేతలందరికీ తెలుసు. చావుబతుకున్న ఉన్న వారు సాయానికి వచ్చినా మన ప్రభుత్వం అని చెప్పి పంపిస్తారని అందరికీ తెలుసు. అలాంటి నేత ఏదో .. ప్రజలకు దాన కర్ణుడిలా సాయం చేస్తాడని యాంకర్ శ్యామలతో చెప్పించుకునే పరిస్థితి వచ్చింది. ఎన్నికలకు ముందు ఆమె ప్రచారం చేయకుండా వ్యక్తిగత విమర్శలు చేయడంతో వైసీపీ ఓడిపోయిన తర్వాత తనను టార్గెట్ చేస్తున్నారని.. తనకు రాజకీయాలు తెలియవని చెప్పుకున్నారు. కానీ ఇప్పుడు మళ్లీ పదవి ఇచ్చారని తప్పుడు మాటలతో తెరపైకి వచ్చేస్తున్నారు.