హైదరాబాద్: బాహుబలి తమిళంలోకూడా హిట్ అవ్వటం అక్కడి హీరో విజయ్‌కు కలిసొచ్చింది. ప్రస్తుతం నిర్మాణదశలో ఉన్న అతని చిత్రం పులి కూడా జానపద, ఫ్యాంటసీ నేపథ్యం కావటంతో ఆ ప్రాజెక్టుకు క్రేజ్ మరింత పెరిగింది. ఈ చిత్రం బడ్జెట్ రు.120 కోట్లు. అసలే జిల్లా, కత్తి చిత్రాలతో విజయ్ మంచి ఊపుమీద ఉండగా బాహుబలి హిట్ అవ్వటంతో పులి చిత్రంపై అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. గత ఏడాది నవంబర్‌లో ప్రారంభమైన ఈ చిత్రం రానున్న సెప్టెంబర్‌లో విడుదల కాబోతోంది. ఆగస్టు 2న ఆడియోను విడుదల చేస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్ సరసన హన్సిక, శృతి హాసన్ హీరోయిన్లుగా నటిస్తుండగా, శ్రీదేవి అత్తగా నటిస్తున్నారు. 29 ఏళ్ళ సుదీర్ఘ విరామం తర్వాత శ్రీదేవి తమిళంలో ఈ చిత్రంద్వారా రీఎంట్రీ ఇవ్వటం విశేషం. కన్నడ నటుడు సుదీప్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. సంగీతం దేవిశ్రీప్రసాద్ సమకూరుస్తున్న ఈచిత్రాన్ని విజయ్ పీఆర్ఓ సెల్వకుమార్ నిర్మిస్తున్నారు.