నారా రోహిత్ అనగానే బాణం సినిమా గుర్తుకొస్తుంది. బాణంతో పరిచయమైన రోహిత్ ఆ తర్వాత సోలో, ఒక్కడినే, ప్రతినిథి, రౌడీ ఫెలో వంటి సినిమాల్లో నటించాడు. ప్రత్యేకమైన కథలను ఎంపిక చేసుకుని తనదైన ప్రత్యేక శైలితో ముందుకు సాగుతున్నారీ నారా హీరో. శనివారం పుట్టిన రోజు జరుపుకుంటున్న నారా రోహిత్ చెప్పిన విశేషాలు…
మీకు పుట్టినరోజుకు నిర్ణయాలు తీసుకునే అలవాటుందా ?
– ప్రత్యేకంగా పుట్టినరోజుకు నిర్ణయాలు తీసుకునే అలవాటు లేదు.
సినిమాల పరంగా ఏమైనా నిర్ణయాలు తీసుకున్నారా?
– బాణంతో హీరోగా కెరీర్ మొదలైంది. ఈ ఆరేళ్ళలో ఆరు చిత్రాల్లో మాత్రమే నటించాను. ఇక నుండి ఎక్కువ చిత్రాల్లో నటించాలని అనుకుంటున్నా.
కథల ఎంపికలోనూ, చిత్రీకరణలోనూ వేగం పెంచాలని, ఈ కొత్త పంథాలో నడవాలనీ
మీ కథలన్నీ స్పెషల్‌గా, సోషల్ ఎలిమెంట్స్ తో ఉంటాయి. కావాలనే అలాంటి కథలను ఎంపిక చేసుకుంటారా?
– కావాలని ఎంపిక చేసుకోవడమనేది ఉండదు. కాకపోతే చిన్నప్పటి నుంచి రాజకీయాల వాతావరణంలో పెరిగాను. అందువల్ల నేను ఎంపిక చేసుకునే కథలన్నీ ఆ మైండ్‌సెట్‌తో ఉంటాయేమో. ఎంటర్టైనింగ్ కథలను ఎంపిక చేసుకున్నప్పటికీ తప్పక ఏదో ఒక ఎమోషన్ అందరికీ కనెక్ట్ కావాలని భావిస్తాను.
లవ్‌స్టోరీల్లో నటించే ఆలోచన లేదా?
– అలాంటి కథలను నా వరకు ఎవరూ తీసుకుని రావడం లేదు. `గీతాంజలి” వంటి స్క్రిప్ట్ ఎవరైనా చెప్తే చేయడానికి రెడీ. కానీ, ఎవరూ అటువంటి కథలను నాకు చెప్పడం లేదు.
మీకు బాగా నచ్చే జోనర్ ఏది?
– స్పోర్ట్స్, యుద్ధాలున్న సినిమాలంటే ఇష్టం. వాటిలో ఇన్స్పిరేషన్ ఉంటుంది. రొమాంటిక్ సినిమాలన్నా ఇష్టమే. నా అభిప్రాయాలన్నీ ఇలాగే కాంట్రాస్ట్ గా ఉంటాయి.
నిర్మాతగా కొనసాగుతారా?
– తప్పకుండా సినిమాలను నిర్మిస్తా. ఇతర నిర్మాణ సంస్థలతో కలిసి ముందుకు సాగాలనే ఆలోచన కూడా ఉంది. నటన, నిర్మాణం రెండూ చేస్తే ఆ సినిమాపై ఎక్కువ ఫోకస్ ఉంటుందని నా భావన.
దర్శకత్వం గురించి ఎప్పుడైనా ఆలోచించారా?
– లేదండీ. కథ చెబితేనే హిట్టో, ఫ్లాపో చెప్పలేను. కానీ మంచిదా, కాదా, అని మాత్రం చెప్పగలను.
బాలకృష్ణగారితో ఓ సినిమాను నిర్మించబోతున్నారనే వార్తలొస్తున్నాయి?
– ఇంతవరకు అలాంటిదేమీ లేదండీ. కానీ అవకాశం వస్తే మాత్రం చాలా సంతోషంగా చేస్తాను.
ప్రస్తుతం రీమేక్ సినిమాలో నటిస్తున్నారుగా? స్పెషల్ కారణాలు ఏమైనా ఉన్నాయా?
– మాన్ కరాటేలో నేటివిటీ తెలుగుకు దగ్గరగా ఉంది. పైగా మనవారికి తగ్గట్టు మార్పులు కూడా చేశాం.
వచ్చే ఏడాది ఈ పాటికి పెళ్లి చేసుకుంటారా?
– ఏమో. ఇదే బ్రహ్మచారిగా చివరి పుట్టిన రోజు కావచ్చేమో. ఇంట్లో నా కన్నా పెద్దవాడు అన్నయ్య ఉన్నాడు. ప్రస్తుతం అన్నయ్యకి సంబంధాలు చూస్తున్నారు. అన్నయ్యకి పెళ్లయితే తర్వాత నా పెళ్లే.
తదుపరి చిత్రాల గురించి చెప్పండి?
– ‘శంకర’ ఫస్ట్ కాపీ సిద్ధమైంది. ఆగష్టులో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ‘పండగలా వచ్చాడుసకు నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. రెండు రోజులు షూటింగ్ బ్యాలన్స్ ఉంది. సెప్టెంబర్ లో విడుదల చేయాలనుకుంటున్నాం. అదే నెలలో పవన్ సాధినేని దర్శకత్వంలో ‘సావిత్రి’ షూటింగ్ ప్రారంభిస్తాం. పాతబస్తీ నేపధ్యంలో “అప్పట్లో ఒకడుండేవాడు” చిత్రం త్వరలో ప్రారంభమవుతుంది. శ్రీవిష్ణు హీరోగా నేను నిర్మించబోయే చిత్రం మరో రెండు నెలల్లో మొదలవుతుంది.