వైసీపీ నుంచి చాలా మంది ఎంఎల్ఎలు టిడిపిలోకి దూకిన తర్వాత ఆ పార్టీని కొంత నిరుత్సాహం ఆవరించింది. జగన్ కూడా మామూలు కంటే ఎక్కువగా సమీక్షలు చర్చలు నిర్వహించారు. మొత్తంపైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైసీపీని దెబ్బతీయగలిగారనే తెలుగుదేశం నేతలు అంచనాకొచ్చారు. దీన్ని గురించి అడిగినపుప్పడు వైసీపీ నేతలు సహజంగానే అదేం లేదని కొట్టిపారేశారు. వారికిష్టమైన కులాల లెక్కలు చెప్పి కాపులు ఇంత జరిగిన తర్వాత తెలుగుదేశం వైపు ఎలా వెళ్తారని ఆయన ప్రశ్నించారు. పైగా జగన్ క్రమేణా వేగం పెంచాలనుకుంటున్నారని కొంత వరకూ సలహాలు స్వీకరిస్తున్నారని కూడా ఆ నాయకుడు అన్నారు. తర్వాత చూస్తుంటే టిడిపిలోనూ అభిప్రాయం మారుతున్నట్టు కనిపిస్తుంది. సామాజిక సమీకరణాలు బిగుసుకుపోయిన ఎపిలో వైసీపీ బలంలో వచ్చిన పెద్ద తగ్గుదల ఏమీ లేదని కొందరు టిడిపి నేతలు కూడా అంగీకరించారు. ఇప్పటికి వైసీపీనే పెద్ద ప్రత్యామ్నాయంగా వుందని అన్నారు. తమకు వ్యతిరేకంగా వారికి ఓటు వేసిన వారెవరూ మళ్లీ ఇటు తిరిగింది లేదని వివరించారు. కాపుల విషయంలోనూ ఎన్ని చర్యలు తీసుకున్నా గతంలో వ్యతిరేకంగా వున్న వారంతా ఇప్పుడు కూడా అలాగే వున్నారని అభిప్రాయపడ్డారు. వారిలో ఇంకా ఏమైనా మార్పు వస్తుందేమో ముందు ముందు చూడాలన్నారు. వెనువెంటనే కాకపోయినా భవిష్యత్తులో జగన్కు ఒక అవకాశం వస్తుందని ఆ టిడిపి ప్రతినిధి జోస్యం చెప్పారు. ప్రత్యేక హాదా నిరాకరణ, ప్యాకేజీ కూడా అంతంత మాత్రంగా వుండటం, తునిలో అమాయకులపై కేసులు పెట్టడం వంటివన్నీ టిడిపిపై వ్యతిరేకత పెంచాయనే భావం వుంది. దాన్ని న్యూట్రలైజ్ చేసుకోవడమే పెద్ద సవాలు కాగా కొత్త వారిని తిప్పుకోవడం ఇంకా కష్టమని అంటున్నారు. బహుశా ఎన్నికలు దగ్గరకు వచ్చే కొద్ది జగన్ మరింతగా జనంలోకి వెళ్లి మద్దతు పెంచుకుంటారని ఆయన అనుయాయులు భావిస్తున్నారు. ఆ లోగా మనం జాగ్రత్త పడాలని టిడిపి నేతలు చంద్రబాబుకు సూచిస్తున్నా