రజనీకాంత్‌లోని చరిష్మా.. కమల్‌హాసన్‌లోని నటన కలిపితే.. మెగాస్టార్ చిరంజీవి అంటున్నాడు మెగా మేనల్లుడు అల్లు శిరీష్. చిరంజీవి 61వ పుట్టిన రోజు వేడుకలు ప్రస్తుతం హైదరాబాద్‌లోని శిల్పాకళా వేదికలో జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో అల్లు శిరీష్ మాట్లాడుతూ ”బాలచందర్ గారు ఓసారి చిరంజీవిగారిని రజనీకాంత్, కమల్‌హాసన్‌లతో పోల్చారు. రజనీలోకి చరిష్మా… కమల్‌హాసన్ లోని నటన కలిపితే చిరంజీవి అని ఆయన చెప్పారు. బాబా ఆడియో ఫంక్షన్లో చిరు, అమితాబ్ బచ్చన్ ఇండియన్ సినిమాలో ఒకే ఒక్క మెగా స్టార్ చిరంజీవి అన్నారు.. అలాంటి మెగా స్టార్ గురించి మాట్లాడేశాక… నా దగ్గర ఏం లేదు. ఓ అభిమానిగా, ఓ మెనల్లుడిగా ఇంతకంటే చెప్పేదేం లేదు” అంటూ తన అభిమానాన్ని బయటపెట్టుకొన్నాడు అల్లు శిరీష్.
మరో మెగా హీరో వరుణ్‌తేజ్ ‘ఇంద్ర’ డైలాగులు చెప్పి అభిమానుల్ని అలరించాడు. ”పెదనాన్నగారు సినిమాలు వదిలేస్తానంటే నేను ఏడ్చేశా. చాలా రోజులు బయటకు రాలేదు. డాడీ సినిమాల్లోకి ఎప్పుడొస్తారు అని నేనే చాలాసార్లు అడిగా. ఎనిమిదేళ్ల తరవాత ఆయన మనందరి మాటా విని.. సినిమా చేయడం ఆనందంగా ఉంది. బాస్ ఈజ్ బ్యాక్” అన్నాడు.