బాహుబలి 1లో కనిపించి, పార్ట్ 2లో మాయమైన పాత్ర అస్లాం ఖాన్. ‘ఈగ’ సుదీప్ ఈ పాత్రలో కనిపించాడు. అస్లాం ఖాన్ని చాలా శక్తిమంతుడిగా, బాహుబలికి మిత్రుడిగా చూపించిన రాజమౌళి.. పార్ట్ 2లో అసలు ఆ పాత్ర ప్రస్తావనే తీసుకురాలేదు. బాహుబలి 2 చూశాక రేగిన ప్రశ్నల్లో ‘అస్లాం ఖాన్’ ఒకడు. ‘అస్లాం ఖాన్ ఏమయ్యాడు?’ అంటూ బాహుబలి అభిమానులు కూడా ప్రశ్నిస్తున్నారు. అయితే నిజానికి అస్లాంఖాన్ పాత్ర పార్ట్ 2లో కూడా ఉందట. కుంతల దేశంలో యుద్ధం ఒకటి జరిగింది. దేవసేన దేశాన్ని శత్రువుల నుంచి కాపాడే క్రమంలో బాహుబలి ఓ యుద్ధమే చేస్తాడు. ఆ సందర్భంగా… అస్లాం ఖాన్ సహాయం తీసుకొన్నట్టు సీన్ రాసుకొన్నార్ట విజయేంద్రప్రసాద్. అయితే.. సమయాభావం వల్ల, సుదీప్ కాల్షీట్ల ప్రభావం వల్ల ఆ సీన్ అనుకొన్నది అనుకొన్నట్టు తీయలేకపోయార్ట.
ఇలా రాసుకొన్న చాలా సీన్లు సమయాభావం వల్ల తీయలేకపోయినట్టు తెలుస్తోంది. అందుకే… అక్కడక్కడ కథ లో జర్కులు వచ్చినట్టు కనిపిస్తోంది. బాహుబలి పార్ట్ 2లో భాగం కాలేకపోయినందుకు సుదీప్ కూడా బాధపడుతుంటాడు.