దువ్వాడ జగన్నాథమ్ తరవాత అల్లు అర్జున్ కొంచెం కూడా విరామం తీసుకోవడం లేదు. వెంటనే తన తదుపరి సినిమా పనుల్లోపడిపోయాడు. డీజే పోస్ట్ ప్రొడక్షన్ అలా అయ్యిందో లేదో, ఇలా కొత్త సినిమా విశేషాల్ని విడుదల చేసేసింది బన్నీ టీమ్. త్వరలోనే వక్కంతం వంశీతో బన్నీ ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. లగడపాటి శ్రీధర్ నిర్మాతగా వ్యవహరిస్తారు. నాగబాబు సమర్పకుడు. ఈ చిత్రం కోసం `నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా` అనే పేరు పరిశీలనలో ఉంది. దాన్నే ఇప్పుడు అధికారికంగా ఖరారు చేసేశారు. విశాల్ శేఖర్ని సంగీత దర్శకులుగా ఎంచుకొన్నారు. ఈనెలలోనే లాంఛనంగా షూటింగ్ మొదలవుతుంది. కథానాయిక ఎవరనే విషయంపై కసరత్తు జరుగుతోంది. ఈ నెలాఖరులోగా హీరోయిన్ విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈనెల 23న దువ్వాడ జగన్నాథమ్ విడుదల కాబోతోంది.