మంచు మనోజ్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. మనోజ్ ఇక సినిమాల్లో నటించడం లేదు. ఈ సంచలన నిర్ణయాన్ని ఆయన ప్రకటించాడు. ప్రస్తుతం మనోజ్ ‘ఒక్కడు మిగిలాడు’ చిత్రంలో నటిస్తున్నాడు. దిని తర్వాత మరో సినిమా చేయాల్సివుంది. ఈ రెండు సినిమాలు పూర్తయ్యాక ఇక ఎలాంటి సినిమాల్లో నటించనని వెల్లడించాడు మనోజ్. ‘ఒక్కడు మిగిలాడు కాకుండా ఇంకో సినిమా చేస్తున్నా. ఈ రెండే యాక్టర్ నా చివరి సినిమాలు. అందరికీ థ్యాంక్స్’ అని తన పేస్ బుక్ లో ప్రకటించాడు మనోజ్. షాకింగ్ గా వుంది మనోజ్ నిర్ణయం.
గత కొన్నాళ్ళుగా మంచు మనోజ్ కెరీర్ గాడి తప్పింది. హిట్లు లేవు. అటాక్ , శౌర్య చిత్రాలు తీవ్రంగా నిరాశ పరిచాయి. అంతకు ముందు కూడా హిట్లు లేవు. ఈ మధ్యవచ్చిన గుంటూరోడు కూడా ఫ్లాప్ అయ్యింది. ఈ నేపధ్యంలో మనోజ్ ఈ నిర్ణయం ప్రకటించడం షాకింగ్ వుంది. అసలు మనోజ్ ఎందుకు ఇలా చేశాడో అర్ధం కావడం లేదు. ఆయన భవిష్యత్ కార్యాచరణ కూడా చెప్పలేదు. మోహన్ బాబు నట వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మనోజ్ .. ఇప్పుడు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం షాకింగానే వుంది. `నటుడిగా ఇదే నా చివరి సినిమా.. అయితే హీరోగా నటిస్తా..` లాంటి ట్విస్టులేమైనా ఇవ్వొచ్చేమో. ఇదే విషయమై.. మనోజ్ పీఆర్లను సంప్రదిస్తే… `మనోజ్ మాక్కూడా అందుబాటులో లేడు.. ఆయన అలా ట్వీట్ ఎందుకు చేశాడో అర్థం అవ్వడం లేద`ని సమాధానం చెప్పారు. మనోజ్ కి ఎప్పటి నుంచో.. దర్శకత్వం పై గురి. బహుశా.. డైరెక్టర్గా తన అదృష్టం పరీక్షించుకొంటాడేమో