బుధవారం అంతా… సోషల్ మీడియాలో మంచు మనోజే హాట్ టాపిక్. ఇక సినిమాలకు గుడ్ అంటూ పొద్దు పొద్దుటే ఓ ట్వీట్ చేసి, అందరి దృష్టినీ ఆకర్షించాడీ మంచు హీరో. చివరికి అంతా ఊహించినట్టుగానే ఆ ట్వీట్‌ని తొలగించి, నా కామెంట్లను అంతా తప్పుగా అర్థం చేసుకొన్నారు, ఏదో చెప్పాలనుకొన్నా – ఇంకేదో అయ్యింది అంటూ.. మాట మార్చేశాడు. నిజానికి సినిమాలకు గుడ్ బై అనే ట్వీట్ ని ఎవ్వరూ పెద్దగా సీరియెస్ గా తీసుకోలేదు. చివర్లో ఇలాంటి ట్విస్ట్ ఏదో ఇస్తాడని ఊహించారు కూడా. చివరికి అదే జరిగింది. అయితే ఈ టోటల్ ఎపిసోడ్స్ తో మనోజ్ కాస్త క్రెడిబులిటీని కోల్పోయాడంతే. ఇలాంటి క్లారిటీ లేని ట్వీట్లు చేస్తే.. మొదటికే మోసం వస్తుందన్న సంగతి మనోజ్ లాంటి కుర్ర హీరోలు, సోషల్ మీడియాతో ఎక్కువగా టచ్‌లో ఉండేవాళ్లు గుర్తించుకోవాలి.
అయితే ఓ విషయంలో మనోజ్ సక్సెస్ అయ్యాడు. బుధవారం అంతా సోషల్ మీడియాని తన వైపుకు తిప్పుకొన్నాడు. దాంతో సాయింత్రం విడుదల చేసిన `ఒక్కడు మిగిలాడు` టీజర్ జనంలోకి వెళ్లగలిగింది. టీజర్ కూడా ప్రామిసింగ్ గానే కనిపిస్తోంది. పొద్దుట మనోజ్ ట్వీట్ లేకపోతే… `ఒక్కడు మిగిలాడు` మిగిలిన అన్ని టీజర్లలానే గప్ చుప్‌గా వచ్చి వెళ్లిపోయేది. మనోజ్ ఇంటెన్షన్ ఈ టీజర్‌పై ఫోకస్ పెట్టించడమే అయితే… ఆ గోల్ రీచ్ అయినట్టే. అయితే దాని కోసం ఇంత గోల చేయాలా..??